రాష్ట్రీయం

చండీయాగం ఏర్పాట్లు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనులను పరిశీలించిన సిఎం కెసిఆర్
రెండోరోజూ ఫాంహౌస్‌లోనే బస

జగదేవ్‌పూర్, డిసెంబర్ 6: రాష్ట్ర సుభిక్షం కోసం నిర్వహించే అయుత చండీయాగం పనులను వేగవంతం చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని ఎర్రవల్లిలో గల తన వ్యవసాయ క్షేత్రంలో ఈ యాగం కోసం ఏర్పాటు చేస్తున్న పనులను సిఎం ఆదివారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి 27 వరకు నిర్వహించతలపెట్టిన అయుత చండీయాగం పనులను సకాలంలో పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. ప్రధానమంత్రితో పాటు, రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నర్సింహన్, తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, గవర్నర్‌లు, ఆయా రాష్ట్రాల ప్రతినిధులు హాజరవుతున్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. అలాగే యాగానికి హాజరయ్యే ప్రతినిధుల కోసం వసతి, పార్కింగ్ కోసం అనువైన స్థలాలను ఎంపిక చేసి ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అంతేకాకుండా రాష్టప్రతి యాగానికి ముఖ్యఅతిధిగా విచ్చేస్తున్నందున ప్రత్యేక హెలిప్యాడ్ ఏర్పాటుకు స్థలా న్ని ఎంపిక చేసి ఏర్పాట్లు పూర్తి చేయాలి చెప్పారు. కాగా ఫాంహౌస్‌కు వెళ్ళే అన్ని రోడ్డు మార్గాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బి, సిఆర్ రోడ్ల శాఖ అధికారులను ఆదేశించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ యాగానికి ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే పీఠాధిపతులతో పాటు వేదపండితులు, రుత్విక్కులుతో పాటు ప్రతి రోజు 60 వేల మందికి భోజన వసతి కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఫాంహౌస్‌కు చేరుకున్న కెసిఆర్ ఆదివారం కూడా ఫాంహౌస్‌లోనే గడిపారు. సోమవారం సాయంత్రం నగరానికి తిరిగి వెళ్ళనున్నారు.
ఇదిలావుండగా, సిఎం కెసిఆర్ ఫాంహౌస్‌లో బస చేయడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సిసి కెమరాలను అమర్చి డేగకన్నుతో కాపలా కాస్తున్నారు. యాగం ఏర్పాట్లను సిద్దిపేట డిఎస్‌పి శ్రీ్ధర్‌తో పాటు ఇద్దరు సిఐలు, 10మంది ఎస్‌ఐలతో రక్షణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.