రాష్ట్రీయం

సాయం 2514 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర బృందాన్ని కోరిన తెలంగాణ
231 మండలాల్లో కరవు
పరిస్థితిని వివరించిన సిఎస్
నిబంధనల మేరకు సిఫార్స్ చేస్తాం
హామీ ఇచ్చిన కేంద్ర బృందం
రెండు రోజులపాటు జిల్లాల్లో పర్యటన

హైదరాబాద్, డిసెంబర్ 7: రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితిని పరిశీలించి 2.5వేల కోట్లు అందించాలని కేంద్ర బృందానికి తెలంగాణ నివేదిక అందించింది. కరవు పరిస్థితి అధ్యయనంలో భాగంగా సోమవారం రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమైంది. సిఎస్ రాజీవ్ శర్మతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు కేంద్ర బృందానికి రాష్ట్రంలోని కరవు పరిస్థితి వివరించారు. 231 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని పూర్తి వివరాలతో కూడిన నివేదిక అందించారు. జిల్లాల్లో వాస్తవ పరిస్థితులు చూసి ఇతోదిక సాయం అందించేలా కేంద్రానికి సిఫార్స్ చేయాలని ఈ సందర్భంగా కేంద్ర బృందాన్ని సిఎస్ కోరారు. కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ ఉత్పల్ కుమార్ సింగ్ నేతృత్వంలో కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర బృందంతో వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర అధికార్లు భేటీ అయ్యారు. తెలంగాణలో నెలకొన్న కరవును ఎదర్కోవడానికి 2514 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. దీనికి సంబంధించిన నివేదికలను కేంద్రానికి ఇంతకుముందే అందించినట్టు వివరించారు. వ్యవసాయ శాఖకు 863 కోట్లు, గ్రామీణ మంచినీటి సరఫరాకు 102 కోట్లు, పట్టణ నీటి సరఫరాకు 80 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్‌కు 134 కోట్లు, పశు సంవర్థక శాఖకు 42, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 369, గ్రాట్యుట్యూయస్ సహాయం కోసం 917 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. జూన్‌లో వర్షాలు బాగా కురవడం వల్ల రైతులు పంటలు వేసుకున్నారని, కానీ జూలై, ఆగస్టు మాసంలో వర్షాలులేక పంటలు ఎండిపోయాయని, దిగుబడి పూర్తిగా దెబ్బతిందని సిఎస్ రాజీవ్ శర్మ కేంద్ర బృందానికి వివరించారు. భూగర్భ జల మట్టం గణనీయంగా పడిపోయిందని, ట్యాంకర్ల ద్వారా మంచినీరు అందించాల్సి వస్తోందని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితుల ఆధారంగా 231 మండలాలకు సంబంధించి పూర్తి నివేదిక ఇచ్చామని, అవసరమైతే మరింత సమాచారం కోరినవిధంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్ర బృందం జిల్లాల పర్యటన సందర్భంగా అధికారులు అడిగిన సమాచారం ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తామని కేంద్ర జాయింట్ సెక్రటరీ ఉత్పల్ కుమార్ సింగ్ హామీ ఇచ్చారు. దానికి తగినవిధంగా నివేదికలు ఇవ్వాలని అధికారులను కోరారు.
మూడు బృందాలు
కేంద్రం నుంచి వచ్చిన అధికారులు మూడు బృందాలుగా రాష్ట్రంలో పర్యటిస్తారు. జి మహారాజకుమార్ బృందం నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో, ఉత్పల్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఒక బృందం మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో, బ్రిజేష్ శ్రీవాత్సవ బృందం నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సోమవారం పర్యటనలు ప్రారంభించింది. మంగళవారం కూడా కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించనున్నాయి. కేంద్ర బృందంతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో మండలాల వారీగా జూన్‌నుంచి సెప్టెంబర్ వరకు నమోదైన వర్షపాత వివరాలు, భూగర్భ జలమట్టం, జలాశయంలో నీటి నిల్వల పరిస్థితి, పంటల వారీ నష్టం, మంచినీటి కొరత, పశుగ్రాసం కొరత, ఉపాధి హామీ ద్వారా అదనపు పని దినాలు, గ్రాట్యుట్యూయిస్ సహాయం తదితర అంశాలపై కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
కేంద్ర బృందంతోపాటు సమావేశంలో రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ స్పెషల్ సిఎస్ ఎస్‌పి సింగ్, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి బిఆర్ మీనా, మెట్రో వాటర్ వర్క్స్ ఎండి జనార్థన్‌రెడ్డి, వ్యవసాయ కార్యదర్శి సి పార్థసారధి, వ్యవసాయ శాఖ సంచాలకులు ప్రియదర్శిని, పంచాయితీ రాజ్ డైరెక్టర్ అనితా రాజేంద్ర, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ కమిషనర్ వెంకట్రామ్‌రెడ్డి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జి కిషన్ , తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండి దినకర్‌బాబు, పశు సంవర్థక శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్‌డబ్ల్యుఎస్ సిఇ నందారావులతోపాటు కేంద్ర బృందంతో వచ్చిన అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.