రాష్ట్రీయం

నవ్యాంధ్రలో భారీగా కొత్త నిర్మాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్థ్యం పెంచుకుని సహకరించండి
సిమెంట్ పరిశ్రమలకు చంద్రబాబు విజ్ఞప్తి
ధరల నిర్ధారణకు యనమల అధ్యక్షతన కమిటీ

హైదరాబాద్, నవంబర్ 28: రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున నిర్మాణాలు జరగనున్నాయని, కనుక సిమెంట్ పరిశ్రమలు సామాజిక బాధ్యతతో వ్యవహరించి ధరల విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో సిమెంట్ పరిశ్రమలదే కీలకపాత్ర అని ప్రభుత్వం గుర్తించిందని, ఎగుమతులు, సముద్ర రవాణా తదితర అంశాల్లో పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో సిమ్మెంట్ కంపెనీ యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్మాణ అవసరాల గురించి, ధరల విషయంలో అనుసరించాల్సిన విధానం గురించి వివరించారు. బడుగు, బలహీన వర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో చేపట్టిన గృహనిర్మాణాలకు పెద్ద మొత్తంలో సిమెంట్ అవసరమవుతుందని, ఎన్టీఆర్ హౌసింగ్, హెచ్‌ఎఫ్‌ఎ, హుద్ హుద్ బాధితులకు స్పెషల్ హౌసింగ్, ఎల్‌ఎల్‌ఆర్‌ఎల్ స్కీం కింద కూడా ఇళ్ల నిర్మాణాలు చేపడతామని వివరించారు. 5.26 లక్షల ఇళ్లకు గానూ ప్రతి త్రైమాసికానికి 35,97,869 మెట్రిక్ టన్నుల సిమ్మెంట్ అవసరమని సిఎం తెలిపారు. రాష్ట్రంలో చేపడుతున్న గృహ నిర్మాణాలు దేశానికే ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు వివరించారు. ప్రభుత్వ అవసరాలకు అందించే సిమెంట్ ధరలు తగ్గినట్టే తగ్గించి బహిరంగ మార్కెట్‌లో సాధారణ వినియోగదారుడికి అందించే సిమెంట్ రేటు పెంచడం సరికాదన్నారు. ప్రతి ఏటా రాష్ట్రంలో ఐదు వేల కిలోమీటర్లు చొప్పున రోడ్ కనెక్టివిటీ ఏర్పరుస్తున్నామని, వీటికోసం కూడా సిమ్మెంట్ అవసరమని చెప్పారు. అలాగే ప్రాజెక్టుల నిర్మాణానికి, కొత్త రాజధాని నిర్మాణానికి సిమెంట్ కావాలని, కనుక కంపెనీలు సామర్ధ్యాన్ని పెంచుకుని సకాలంలో సిమెంట్ సరఫరా చేయాలని చెప్పారు.
ఇదిలావుంటే, సిమెంట్ ధర ఎంత ఉండాలనేది నిర్ధారించేందుకు ముగ్గురు మంత్రులతో కమిటీ వేయనున్నట్టు సిఎం తెలిపారు. ఈ కమిటీలో యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, పత్తిపాటి పుల్లారావు ఉంటారన్నారు. ఈ సమీక్షలో సిఎంఓ ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్ర, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎస్‌ఎస్.రావత్, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
జామ్ విధానం ఉత్తమ సంస్కరణ
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన ‘జామ్’ విధానం దేశంలోనే ఉత్తమమైన సంస్కరణగా సిఎం పేర్కొన్నారు. జన్‌ధన్ వల్ల అందరికీ బ్యాంకింగ్ సేవలు, ఆధార్ వల్ల అర్హులకే సంక్షేమ పధకాలు, మొబైల్ ద్వారా సాంకేతిక విప్లవం సామాన్యుడికి కలిసి వచ్చిందన్నారు. రెవిన్యూ శాఖ చేపట్టిన ‘మీ ఇంటికి-మీ భూమి’ కార్యక్రమం ప్రజలకు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చిందన్నారు. ఇంత వరకూ కోటి 80 లక్షల మంది సందర్శకులు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించారని, రోజు 75 వేల మంది తమ ల్యాండ్ రికార్డులను తనిఖీ చేసుకుంటున్నారని చెప్పారు. దీని ద్వారా ఇప్పటివరకూ 73 లక్షల ఫిర్యాదులను పరిష్కరించామని, ఇ-గవర్నెన్స్‌లో ఏపి దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని చంద్రబాబు తెలిపారు.