సబ్ ఫీచర్

‘కామిక్ టానిక్’తో ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదో పాతకాలం నాటి సినిమా పాట అని విని వదిలేయటం కాదు. ‘నవ్వులు రువ్వే పువ్వమ్మా.. నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా..’ అన్నట్టుగా ప్రతిరోజునీ అందమైన నవ్వులతో గడిపేస్తుంటే జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది? అసలు నవ్వురానివారు, నవ్వలేనివారు మనిషే కాదని అంటారు మేధావులు. ఆ మాట అలా వుంచితే, నవ్వు ఆనందాన్నిచ్చే అద్భుతమైన సాధనమని భావించాల్సిందే. నవ్వు గొప్పతనం గురించి ఎన్నోసార్లు విన్నా, చదివినా.. మళ్లీ మళ్లీ దాని గురించి చర్చించుకోవటమే ఆహ్లాదాన్ని పెంచే విషయంగా చెప్పవచ్చు. నవ్వు ఆనందానికి ఉల్లాసాన్ని తోడు చేస్తుంది. ఉల్లాసం ఉత్సాహంతో జత కడుతుంది. పరిసరాలన్నీ ఆనందంతో నిండిపోతాయి. ఉత్సాహంతో ఊగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆనందానికి శబ్దరూపమే నవ్వు. హాయిగా నవ్వటం వలన మన లోపలి అవయవాలకు ‘మసాజ్’ జరిగి రక్తంలోకి పదిరెట్లు ఎక్కువగా ఆక్సిజన్ విడుదల అవుతుంది. ప్రాణశక్తి బాగా పెరుగుతుంది. ముఖ్యంగా అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. మన శారీరక, మానసిక ఆరోగ్యానికి నవ్వు ఎంతో ముఖ్యం. మన పెద్దవాళ్ళు అంటుంటారు- ‘నవ్వితే నవరత్నాలు’ అని. నవరత్నాల సంగతేమో కానీ, నవ్వు కారణంగా నవ నవోనే్మషమైన ఉత్సాహం, సంతోషం మనసులో పెల్లుబికి ముఖంలోకి తేజస్సు వస్తుంది. మన ఆత్మానందం ఆ విధంగా నవ్వు రూపంలో మన శరీరంలోని ప్రతి అవయవంపైనా ప్రతిఫలిస్తుంది. మనలో వున్న థైమస్ కణాలను నవ్వు పెంచుతుంది. అవి పెరగటం వలన వైరస్‌ల నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది. హాయిగా, స్వేచ్ఛగా నవ్వినపుడు మనలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. అవి రోగ నిరోధక వ్యవస్థను గట్టిపరుస్తాయి. వైరస్‌లు, బ్యాక్టీరియాలు, ఇన్‌ఫెక్షన్లు మన దరి చేరకుండా రోగ నిరోధక వ్యవస్థ అడ్డుపడుతుంది.
నవ్వటం వలన శ్వాసకోశం శుభ్రపడుతుంది. ఊపిరితిత్తుల్లో నిల్వ వుండిపోయిన కార్బన్ డై ఆక్సైడ్ నీటి ఆవిరి బయటకు పంపబడుతుంది. ఆక్సిజన్ పుష్కలంగా ఊపిరితిత్తులలోకి చేరుతుంది. నవ్వటం వలన మన ఊపిరితిత్తుల లోపలి నుంచి శ్వాసిస్తాము. తల భాగానికి రక్తాన్ని అందించే నాళాలను వదులుచేస్తుంది. మెదడుకు రక్తసరఫరా మరింత మెరుగవుతుంది. హాయిగా నవ్వటంతో కుంగుబాటును తరిమేయవచ్చు. ‘సెన్సాఫ్ హ్యూమర్’ ఉన్నవారు- అది లేనివారికంటే సృజనాత్మకంగాను, సమస్యలకు సరైన పరిష్కారాన్ని అందించగలిగినవారిగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. మనసారా నవ్వడం నిజంగా ఒక వరం. అందుకే నవ్వుల్ని పూయిద్దాం.. జీవితాలను పండిద్దాం.

-హిమజారమణ