రాష్ట్రీయం

వైకాపా బురద రాజకీయం చేస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెదేపా నేత వర్ల రామయ్య విమర్శ
హైదరాబాద్, నవంబర్ 28: అవినీతి బురదలో మునిగి తేలిన వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి తన అవినీతి బురద అందరికీ అంటించాలని తంటాలు పడుతూ బురదరాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వైకాపా నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును విమర్శించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రావణాసురుడు సీతమ్మకు నీతులు చెప్పినట్లు ఉందని ఎద్దేవా చేశారు. జగన్‌కు చెందిన వేల కోట్ల అక్రమ ఆస్తులను ఈడి జప్తు చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని జగన్ ప్రజల ముందుకు ఎందుకు తీసుకురాలేదో వెల్లడించాలని చెప్పాలని డిమాండ్ చేశారు.

‘సీమ’కు అన్యాయం: శైలజానాథ్
హైదరాబాద్, నవంబర్ 28: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమకు అన్ని విధాలా అన్యాయం చేస్తున్నారని ఎపి కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. శనివారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర రాజధానిని రాయలసీమకు దక్కకుండా చేసిన చంద్రబాబు చిత్తూరు జిల్లాలో తాగు నీటి పథకాన్ని రద్దు చేశారని తెలిపారు. గత ప్రభుత్వం 7,390 కోట్ల రూపాయలు కేటాయించిన ఈ పథకాన్ని ఎందుకు రద్దు చేశారని ఆయన టిడిపి సర్కారును ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత పథకాలను రద్దు చేయడం సమంజసం కాదని శైలజానాథ్ అన్నారు.