రాష్ట్రీయం

పునాదుల్లో బుద్ధ విగ్రహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగులుప్పలపాడు, డిసెంబర్ 7 : ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం కనపర్తి గ్రామంలో అరుదైన బుద్ధుని పంచలోహ విగ్రహాలు, పూజా సామగ్రి సోమవారం లభ్యమైయ్యాయి. గ్రామాల్లోని పోలేరమ్మ తల్లి ఆలయానికి సమీపంలో గ్రామానికి చెందిన రైతు పోతినేని సోమయ్య తన సొంత పొలంలో ఇంటి మెరక కోసం దిబ్బలు తీసుకుండగా కుండతో పాటు లోహ విగ్రహాల ఆనవాళ్లు లభ్యం అయ్యాయి. దీంతో విషయాన్ని గ్రామంలో కల పురావస్తు శాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళాడు. వెంటనే స్పందించిన అధికారులు పురావస్తు శాఖ అధికారులు కుండను స్వాధీనం చేసుకోవడంతో పాటు పరిసరాల్లో తవ్వకాలు జరిపారు. దీంతో రెండు బౌద్ధుల స్థూపాలు, ప్రాచీన బౌద్దరామానికి సంబంధించిన ఆనవాళ్లు లభ్యం అయ్యాయి. కుండలోని బౌద్ధ విగ్రహాలను రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకుంది. దీంతో వస్తువులను రసాయన శుద్ధి అనంతరం ప్రదర్శన కోసం మ్యూజియంలో భద్ర పరిచారు. (చిత్రం)బౌద్ధుల స్థూపాలు
‘కర్నూలు’ టెంపుల్ టూరిజం
నంద్యాల, డిసెంబర్ 7:కర్నూలు కేంద్రంగా టెంపుల్ టూరిజం పథకాన్ని అమలుపరిచేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రముఖ దేవాలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి అదనపు ఆదాయం లభించడంతో పాటు భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. సోమవారం కర్నూలు జిల్లా నంద్యాలలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక రాష్ట్ర ప్రజలు ఎక్కువగా మంత్రాలయం, శ్రీశైలం దేవస్థానాలకు పెద్ద సంఖ్యలో వస్తున్నారన్నారు. వీరికి జిల్లాలోని ఇతర ప్రముఖ దేవాలయాల దర్శనభాగ్యం కల్పించేందుకు టూరిజం ప్యాకేజీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్యాకేజి కింద జిల్లాలోని మంత్రాలయం, శ్రీశైలం, ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయం, మహానంది, అహోబిలం, యాగంటి, కడప జిల్లా బ్రహ్మంగారి మఠం తదితర పెద్ద ఆలయాలను కలుపుతూ టూరిజం, దేవాదాయశాఖల సంయుక్త ఆధ్వర్యంలో టెంపుల్ టూరిజం పథకానికి శ్రీకారం చుటుతున్నట్లు తెలిపారు. ఆయా ఆలయాల సందర్శనతో పాటు దర్శనాలు వేగంగా పూర్తి చేసుకుంటూ వసతి, రవాణా సౌకర్యాలు కల్పించే విధంగా టూరిజం ప్యాకేజీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ప్రకృతి చెలగాటంతో ఆగిన రైతన్న గుండె
ఆత్మకూరు, డిసెంబర్ 7: కొన్నాళ్ల క్రితం వరకు తీవ్ర దుర్భిక్షం, ఆ తరువాత అంతూదరి లేని రీతిలో భారీ వర్షాలు కురవడంతో ఓ రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయారై తీవ్ర మనోవేదనతో ప్రాణాలు విడిచాడు. సోమవారం ఉదయం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని నెల్లూరుపాళెం ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.నెల్లూరుపాళెంకు చెందిన మాదాల వెంకటేశ్వర్లు (58) అనే రైతు ఐదెకరాల నిమ్మతోటతో పంట పండించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే కొద్ది నెలల క్రితం వరకు కరవునెలకొని వానలే కురవకపోవడంతో నిమ్మ చెట్లు నిలువునా ఎండుముఖం పట్టసాగాయి. చేతికి అందివచ్చిన కాపు కాస్తా చెట్లు ఎండిపోవడంతో చేసేదేమీలేక నిమ్మచెట్లన్నీ తెగనరికి మినుము సాగుకు సమాయత్తం అయ్యాడు. తొలకరిలో కురిసిన ఓ మోస్తరు జల్లులతో మినుము పంటకు తొలుత ఊపిరి వచ్చినట్లైంది. తీరా, పంట చేతికొచ్చే దశలో భారీ వర్షాలు కారణంగా చేతికొచ్చే మినుముపంటలో కాయల నుంచి మొక్క మొలిచింది. రెండురోజుల క్రితం పొలానికి వెళ్లిన మాదాల వెంకటేశ్వర్లు మొక్క మొలిచిన పంటను తీక్షణంగా చూస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగు పొలాలకు చెందిన రైతులు హుఠాహుటిన అతనికి సపర్యలు చేస్తూ ఆసుపత్రికి తరలించారు.