రాష్ట్రీయం

జీవ వైవిధ్య బోర్డు ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్వరలో చైర్మన్, కార్యదర్శుల నియామకం తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, నవంబర్ 28: తెలంగాణ జీవ వైవిధ్య బోర్డును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బోర్డుకు చైర్మన్, సభ్య కార్యదర్శులను ప్రభుత్వం నియమించనుంది. పూర్తిస్థాయి చైర్మన్, సభ్య కార్యదర్శిని ప్రభుత్వం ఇంకా నియమించాల్సి ఉన్నందున ఎక్స్‌అఫీషియో చైర్మన్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియమించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగిలిన ఎక్స్‌అఫీషియో సభ్యులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఎవరెవరు ఉండాలనే అంశంపై స్పష్టత ఇస్తూ శనివారం జివో జారీ చేసింది. ఎక్స్‌అఫీషియో సభ్యులుగా అటవీ, పర్యావరణ, సైన్స్‌అండ్‌టెక్నాలజీ శాఖ ముఖ్యకార్యదర్శి, పశుసంవర్థక, మత్స్యశాఖ ముఖ్యకార్యదర్శి, వ్యవసాయ, సహకార శాఖ ముఖ్యకార్యదర్శి, మెట్ట పంటల పరిశోధన సంస్థ డైరక్టర్లను నియమించాలని తెలిపింది. మెడిసినల్ ప్లాంట్స్, అరోమెటిక్స్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ప్లాంట్ జెనెటిక్స్ రీసోర్సెస్ జాతీయ బ్యూరో ప్రిన్సిపల్ సైంటిస్ట్, సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ డైరక్టర్, అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్, ఆదిలాబాద్‌కి చెందిన రామకృష్ణ సేవాసమితి అధ్యక్షుడిని నిపుణుల విభాగం సభ్యులుగా చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.