రాష్ట్రీయం

బ్లాక్ డే..ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం
చార్మినార్ వద్ద ర్యాలీ
డిజెఎస్ నేతలతోపాటు 50మంది అరెస్టు, విడుదల

హైదరాబాద్, డిసెంబర్ 6: బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ కొన్ని సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు ఆదివారం హైదరాబాద్‌లో ‘బ్లాక్ డే’ ప్రశాంతంగా జరిగింది. పాతబస్తీలో పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముస్లిం సంఘాలు పలుచోట్ల ఏర్పాటు చేసిన నల్ల జెండాలను పోలీసులు తొలగించారు. చార్మినార్ మక్కా మసీదు వద్ద ర్యాలీ నిర్వహించేందుకు యత్నించిన డిజెఎస్ నేతలు జావిద్, ఖాలీద్‌లతోపాటు 50మందిని అరెస్టు చేశారు. మీర్‌చౌక్ వద్ద మరికొందరిని అదుపులోకి తీసుకొని ఆదివారం సాయంత్రం వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టినట్టు ఈస్ట్‌జోన్ డిసిపి వి సత్యనారాయణ తెలిపారు. బ్లాక్ డేకు ఒక రోజు ముందే నగరంలోని దాదాపు 150మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకొని కౌనె్సలింగ్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు కుట్టదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. తెలంగాణలోని హైదరాబాద్ నగరంతో పాటు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్‌లోని భైంసా, నిర్మల్, నల్గొండ, మహబూబ్‌నగర్‌లలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. బ్లాక్ డే సందర్భంగా సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, విజయవాడ, కర్నూలు, ఆదోనిలతోపాటు ప్రధాన మున్సిపాలిటీల్లో కూడా పోలీసులు నిఘా పెంచారు. అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు. సంఘ విద్రోహశక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన ఉపేక్షించేదిలేదని హైదరాబాద్ సౌత్‌జోన్ డిసిపి సత్యనారాయణ హెచ్చరించారు. ముఖ్యంగా పాతబస్తీలో 50మంది సిఐలను, 150మంది ఎస్‌ఐలతోపాటు ఐదువందల మంది కానిస్టేబుళ్లను బందోబస్తుకు కేటాయించారు. ప్రధాన కూడళ్లతోపాటు రైల్వే స్టేషన్లు, ఆర్టీసి బస్సుస్టేషన్లు, విమానాశ్రయాల్లో అదనపు బలగాలను మోహరింపజేశారు. తెలంగాణలోని కరీంనగర్, జహీరాబాద్, జగిత్యాలలో ముస్లింలు ర్యాలీలు నిర్వహిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని సాయంత్రం వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆధోని, గుంటూరులో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే సమీపంలోని పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని అదనపు డిజిపి ఆర్‌పి ఠాకూర్ సూచించారు. బ్లాక్ డే సందర్భంగా మతపరమైన ఎలాంటి సమావేశాలకు అనుమతి ఇవ్వలేదు. (చిత్రం) చార్మినార్ మక్కా మసీదు వద్ద ర్యాలీ నిర్వహిస్తున్న డిజెఎస్ కార్యకర్తలు