రాష్ట్రీయం

తిరుమలలో విస్తృతంగా తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్లాక్ డే సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక

తిరుపతి, డిసెంబర్ 4: బాబ్రీ మసీదు కూల్చివేత నేపధ్యంలో ఆదివారం బ్లాక్‌డే కావడంతో కేంద్ర నిఘా వర్గాల అప్రమత్తంగా ఉండాలని చేసిన హెచ్చరికలతో ఇటు టిటిడి విజిలెన్స్, పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా శుక్రవారం తిరుమల, తిరుపతిల్లోని జనసంచారం ఉన్న ప్రధాన ప్రాంతాలతోపాటు, తిరుమలకు వెళ్ళే రెండు కనుమదారులతోపాటు నడక మార్గాలైన అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను అణువణువు తనిఖీ చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అర్బన్ ఎస్పీ గోపినాథ్ జెట్టి ఆధ్వర్యంలో తిరుపతి రైల్వే స్టేషన్, బస్‌స్టేషన్‌లతోపాటు తిరుపతి, తిరుచానూరుల్లోని ఆలయాలైన గోవిందరాజస్వామి ఆలయం, కోదండరామాలయం, కపిలతీర్థం, పద్మావతి అమ్మవారి ఆలయం, మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తనిఖీలు చేశారు. తిరుపతిలోకి వచ్చే చెన్నయ్, కర్ణాటక మార్గాల్లోని జాతీయ రహదారుల్లో నాకాబంది నిర్వహిస్తున్నారు. అనుమానితులు ఎవరైనా కనపడినా, అనుమానాస్పద వస్తువులు కనబడినా 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తిరుమల్లో టిటిడి సివిఎస్‌ఓ నాగేంద్రకుమార్, అదనపు సివిఎస్‌ఓ శివకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో తిరుమల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తిరుమల్లో ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారని, సెల్‌ఫోన్లను, కెమెరాలను లాకర్లలో దాచారని, లేపాక్షి సమీపంలోని ఏటిఎంలో డబ్బులు డ్రా చేశారనే ప్రచారాన్ని సివిఎస్‌ఓ ఖండించారు. డిసెంబర్ 6న బ్లాక్‌డే కావడంతో దేశంలోని ప్రధాన నగరాలను, ఆలయాలను నిఘావర్గాలు అప్రమత్తం చేస్తాయని అందులో భాగంగానే తిరుమల్లో పోలీసులతో కలిసి తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. భక్తులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన శిక్షలు ఎదుర్కొవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు.