రాష్ట్రీయం

మోటారు సైకిల్‌పై అమాత్యుల తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 24: ఈ ఫోటోలోని వారిని చూశారా... వారు అమాత్యులే. గన్‌మెన్‌ను వదలి ప్రజా సేవలో మమేకమైన వారు రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ, జిల్లా ఇన్‌చార్జిమంత్రి, రాష్ట్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నీటమునిగిన నెల్లూరులో మకాం వేసి పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి శిద్దారాఘవరావు, మంత్రి పి నారాయణతో కలిసి ద్విచక్రవాహనంపై తిరుగుతూ వరద బాధిత ప్రాంతాలను పరిశీలించారు. నగరంలో ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ బాధితులకు భరోసా ఇస్తున్నారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అనంతరం వారు రామిరెడ్డి కాలువ ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సిఎం ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని పంట కాలువల ఆక్రమణలు తొలగిస్తున్నామని, ఈ ఆక్రమణల తొలగింపునకు ప్రజలు సహకరించాలని వారు కోరారు. (చిత్రం)
నెల్లూరు నగరంలో వరద ముంపు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటున్న మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావు