సబ్ ఫీచర్

చిన్నారుల మనసు గెలిచిన గ్లోబల్ విజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మంచి ఉపాధ్యాయుడు సామాజిక వైద్యుడు’’ అని అంటారు. ఎగిరే గాలిపటానికి ఆధారం దారం ఎలాగో విద్యార్థులకు నైతిక విలువలు నేర్పే గురువు అలాంటివాడు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించే గురువుఆదర్శ సమాజ నిర్మాతగా మనగలుగుతాడు. పసి మనసులో గురువునాటే బీజాలే వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దుతుంది. దీనిని ఆచరణలో చేసి చూపెట్టారు హానాను అల్ హ్రాబ్. నిరంతరం ఘర్షణలు, బాంబుల మోతలతో నెత్తురోడే పాలస్తీనాలో ఓ ప్రాధమిక పాఠశాల టీచర్ ఈయేటి మేటి గ్లోబల్ టీచర్ అవార్డు సాధించారు. కేరళకు చెందిన భారతీయ టీచర్ రాబిన్ చౌరాసియాను ఓడించి ఈ బహుమతిని ఆమె సొంతం చేసుకున్నారు. మిలియన్ డాలర్ల బహుమతిని సాధించారు. దుబాయ్‌కు చెందిన వార్కే ఫౌండేషన్ ప్రతే ఏటా ఇచ్చే గ్లోబల్ టీచర్ అవార్డు కోసం జపాన్, కెనడ, కెన్యా, ఇండియా, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి దాదాపు 8000 నామినేషన్లు వచ్చాయి. ఇందులో తుది ఎంపికకు పదిమంది మాత్రమే మిగిలారు. వీరిలో ఒకరు మనదేశానికి చెందిన రాబిన్ చౌరాసియా. ఈ పదిమందిలో పాలస్తీనాకు చెందిన హానాను అల్ హ్రాబ్ 2016 వార్కే ఫౌండేషన్ గ్లోబల్ టీచర్ అవార్డుకు ఎంపికయ్యారు. ముప్పయి ఏళ్ల చౌరాసియా ముంబయిలోని రెడ్‌లైట్ ఏరియాలో ఆడపిల్లల కోసం పాఠశాలను ఏర్పాటుచేసి లాభాపేక్ష లేకుండా నడుపుతున్నారు. కాని విద్యార్థులపై అత్యంత ప్రభావం చూపే టీచర్ విద్యాబోధననే ప్రామాణికంగా తీసుకున్న జ్యూరీ కమిటీ హానాను అల్ హ్రాబ్ పట్ల మొగ్గుచూపింది. వెస్ట్ బ్యాంక్ సిటీలోని అల్‌బిరెహ్ అనే ప్రాంతంలో హైస్కూల్‌లో హానాను హ్రాబ్ ప్రాధమిక విద్యార్థులకు టీచర్‌గా పనిచేస్తున్నారు. చిన్నారులకు ఆటలతో పాఠాలను మిళితం చేసి హ్రాబ్ చేసే బోధన జడ్జీలను ముగ్ధులను చేసింది. ఈ విద్యాబోధనే ఆమెను విజేతను చేసింది. పాలస్తీనా చుట్టూ ఇజ్రాయిల్ మూకలు మాటువేసి దాడులు చేస్తుంటాయి. శాంతి, సామరస్యాలు కొరవడిని పాలస్తీనాలో విద్యార్థులకు పసి వయసు నుంచే శాంతి వచనాలు హ్రాబ్ బోధిస్తారు. హ్రాబ్ విద్యాబోధన ఆ స్కూలులో పనిచేసే సహచర టీచర్లను కూడా తన దారిలో నడిపించేలా చేసింది.‘‘ ఆటలాడుకోవటం అనేది పిల్లల హక్కుగా పరిగణించాలి. వారికి ఆటలతో మిళితం చేసే విద్యాబోధన చేయటం వల్ల సామాజిక జీవితంలోనూ మార్పు వస్తుందని’’ పోప్ తన సందేశంలో ప్రశంసిస్తూ పేర్కొనటం హానాను హ్రాబ్ విద్యాబోధనకు నిదర్శనంగా చెప్పవచ్చు. అవార్డు ప్రదానోత్సవానికి హాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, ప్రణీత చోప్రా, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బెయిలర్, దుబయ్ దేశాధినేత మహ్మద్ బీన్ రషీద్ తదితర అతిరధ మహారధులు హాజరై హానాను అల్ హ్రాబ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా హానాను అల్ హ్రాబ్ మాట్లాడుతూ ఇది శాంతిని కోరుకునే పాలస్తీనా ప్రజల విజయమని, మాకు శాంతి కావాలని కోరుకుంటున్నామని వినమ్రంగా వెల్లడించారు.

చిత్రం... గ్లోబల్ టీచర్ విజేత హానాను అల్ హ్రాబ్