సబ్ ఫీచర్

శతాబ్దం నాటి కథ.. నేడు వెలుగులోకి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడో శతాబ్దం క్రితం రాసిన కథ.. ఇన్నాళ్లూ మరుగున పడిపోయింది.. దాదాపు102 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత నేడు ఆ కథ పుస్తక రూపంలో ప్రపంచం ముంగిటకు వస్తోంది.. పిల్లల సాహిత్యంలో విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ రచయిత్రి హెలెన్ బీట్రిక్స్ పోటర్ 1914లో రాసిన ‘ది టేల్ ఆఫ్ కిట్టీ ఇన్ బూట్స్’ కథను కొన్నాళ్ల క్రితం తాము కనుగొన్నామని, ఈ ఏడాది సెప్టెంబర్‌లో దాన్ని పుస్తకరూపంలో అందించేందుకు నిర్ణయించామని ప్రఖ్యాత ప్రచురణ సంస్థ ‘పెంగ్విన్’ తాజాగా ప్రకటించింది. ‘ది టేల్ ఆఫ్ పీటర్ రాబిట్’ రచయిత్రిగా పుస్తక ప్రియులందరికీ తెలిసిన హెలెన్ బీట్రిక్స్ 1866 జూలై 28న లండన్‌లో జన్మించారు. ‘ది టేల్ ఆఫ్ పీటర్ రాబిట్’ 45 మిలియన్ల కాపీలకు పైగా అమ్ముడుపోయింది. 36 భాషల్లో దీన్ని అనువదించడంతో దేశదేశాల్లో విశేష ఆదరణ పొందింది. పిల్లల కథలను వినూత్న రీతిలో ఆవిష్కరించిన ఆమె 1943 డిసెంబర్ 22న మరణించారు.
శతాబ్దం తర్వాత వెలుగు చూస్తున్న ‘ది టేల్ ఆఫ్ కిట్టీ ఇన్ బూట్స్’ కథ ఓ నల్లపిల్లికి సంబంధించినది. 1914లో రాసిన ఈ కథ రాతప్రతిని లండన్‌లోని ‘విక్టోరియా, ఆల్బ్రెట్ మ్యూజియంలో దాదాపు రెండేళ్ల క్రితం కనుగొన్నట్లు ‘పెంగ్విన్’ సంస్థ చెబుతోంది. బీట్రిక్స్ 150వ జయంతి సందర్భంగా ఈ కథను ప్రపంచవ్యాప్తంగా పిల్లల కోసం ఈ ఏడాది సెప్టెంబర్‌లో అందుబాటులోకి తెస్తున్నామని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ కథను ప్రచురించాలని తాను బతికి ఉన్న రోజుల్లోనే బీట్రిక్స్ ఎంతగానో తపన పడ్డారు. పిల్లలను మరింతగా అలరించాలన్న భావనతో ఆమె ఈ కథను రెండుసార్లు తిరగరాశారు, ఒకటి రెండు బొమ్మలు కూడా వేశారు. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో వివాహం చేసుకున్న బీట్రిక్స్ ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు, ఇతర వ్యాపకాల్లో తలమునకలయ్యారు. దీంతో ‘ది టేల్ ఆఫ్ కిట్టీ ఇన్ బూట్స్’కు కథకు ప్రచురించడానికి ఆమెకు వీలుకాలేదు. ఈ కథ ఇన్నాళ్లూ మరుగున పడిపోయినా, ఆసక్తికరమైన కథనం అందరినీ అలరిస్తుందని ‘పెంగ్విన్’ నిర్వాహకులు భరోసా ఇస్తున్నారు. అలరించే హాస్యం, ఆకట్టుకునే పాత్రలు ఇందులో ఉన్నాయంటున్నారు. కాగా, పిల్లలకు ఆద్యంతం ఆసక్తి కలిగించేలా ఉన్న ఈ కథ శతాబ్దానికి పైగా అముద్రితంగా ఉండిపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని, రాతప్రతిని పుస్తక రూపంలో మలచిన క్వెంటిన్ బ్లేక్ అంటున్నారు. రోనాల్డ్ దహ్లెస్ రాసిన పిల్లల పుస్తకాలకు బొమ్మలు వేయడంలో ప్రసిద్ధి చెందిన ఆయన ‘ది టేల్ ఆఫ్ కిట్టీ ఇన్ బూట్స్’ ఆవిష్కరణలో భాగస్వామ్యం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కథలు రాయడంలోనే కాదు, వాటికి తగిన బొమ్మలు వేయడంలోనూ బీట్రిక్స్ తనలాంటి వారికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని ఆయన తెలిపారు.

-ఎస్సార్