సబ్ ఫీచర్

కురులను సవరించండి ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమైన కురులు మగువల సౌందర్య చిహ్నాలుగా నిలుస్తాయి. ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పద్ధతుల కారణంగా నేడు మహిళలు శిరోజాలకు సంబంధించి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. తలపై వెంట్రుకలు రావడం, రాలిపోతుండడం సహజమైన ప్రక్రియ. జుట్టు ఎందుకు రాలిపోతుందని ప్రశ్నించుకుంటే- అందుకు అనేక కారణాలు చెప్పవచ్చు. ఇందుకు ముఖ్య కారణం తినే ఆహారంలో పోషక విలువల లోపం. సన్నగా, నాజూగ్గా వుండాలన్న ధ్యాసలో ఈనాటి అమ్మాయిలు పోషకాహారాన్ని విస్మరిస్తున్నారు. ఫలితంగా ఇనుము, జింకు, బయాటిన్‌ల లోపం అధికమై కురులు రాలిపోతాయి. మానసిక రుగ్మతలు వున్నవారిలోనూ ఇదే పరిస్థితి. నెలసరి నిలిచిపోయిన తరువాత స్ర్తిలలో పురుష హార్మోన్ టెస్టోస్టిరాన్ ప్రభావంతో కురులు తగ్గుతాయి. మధుమేహం, లివర్, కిడ్నీ వ్యాధుల వల్ల కూడా జుట్టు రాలిపోవచ్చు. ఎక్కువగా తలదువ్వడం, అతిగా షాంపూలు వాడినా, కుదుళ్లలో చికాకు పెరిగి జుట్టు రాలుతుంది.
శీతాకాలం వచ్చిందటే చాలు చాలామందికి జుట్టు పొడిబారుతుంది. చలిగాలిలో బయటకు వెళ్లవలసిన వారు తమ కేశాలపై ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. శీతాకాలంలో స్వచ్ఛమైన గోరువెచ్చని కొబ్బరినూనె కుదుళ్లకు పట్టేలా రాసుకోవాలి. లేదా ఆలివ్ ఆయిల్ కూడా వాడవచ్చు. షాంపూలకు బదులుగా ఎండిన ఉసిరికాయ ముక్కలు, కుంకుడుకాయలు, శీకాకాయ వాడుకుంటే జుట్టు నల్లగా వత్తుగా పెరుగుతుంది. తలస్నానం చేశాక జుట్టును సహజ సిద్ధంగా ఆరనివ్వాలి. దూర దూరంగా పళ్లు వున్న దువ్వెనలను మాత్రమే వాడాలి. జుట్టు తడిగా వున్నపుడు దువ్వితే ఎక్కువ జుట్టు ఊడుతుంది. శీతాకాలంలో చుండ్రు సమస్య చాలామందిని బాధిస్తుంది. నిమ్మకాయ రసాన్ని తలంతా పట్టించి రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో చేతులతో బాగా రుద్దుతూ కడిగేయాలి. ఇలా చేస్తే చుండ్రు రాలిపోతుంది. రాత్రి మెంతులు నానపోసి ఉదయమే రుబ్బి, ఆ ముద్దను తలకు పట్టించుకుని గంట తరువాత స్నానం చేస్తే జుట్టు ఏపుగా పెరుగుతుంది.
జుట్టు విరబోసుకోవడం నేటి ఫ్యాషన్. దీనివల్ల కూడా జుట్టు త్వరగా రాలిపోతుంది. అందుకు వీలైనంత వరకూ జుట్టు చక్కగా దువ్వుకుని జడ వేసుకునే ప్రయత్నం చేయాలి. తలను శుభ్రంగా వుంచుకోకపోవడం, వేడి నీటితో తలంటుకోవడం, అవసరానికి మించి డ్రై చేసుకోవటం వల్ల జుట్టు ఊడిపోవటమే కాక తెల్లబడుతుంది. జుట్టు ఎంత పొడుగ్గా వున్నా, ఆరోగ్యంగా వున్నా తెల్లబడితే అది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. తెల్ల జుట్టుకు హెన్నా వంటివి తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే. తెల్లని, రాలుతున్న జుట్టుకు ఉసిరికాయలు మేలైన మందు. ఉసిరికాయల పేస్ట్‌ను రోజూ తలకు మట్టించుకుని మసాజ్ చేసుకోవాలి. కొబ్బరి నూనెలో గోరింటాకు పొడి చేర్చి ఆ మిశ్రమాన్ని రోజూ తలకు పట్టించుకోవాలి. ఆ తర్వాత శీకాకాయ, కుంకుడుకాయతో తలంటుకోవాలి. ఇలా చేస్తే తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది. అన్నింటికంటే ముఖ్యం మనం తీసుకునే ఆహారంలో విటమిన్ బి, ఐరన్, కాపర్,అయోడిన్‌లు బాగా వుండేట్లు చూసుకోవాలి. ఆకుకూరలు, టమాటా, కాలీఫ్లవర్, అరటి పళ్ళ వంటివి ఆహారంలో ఎక్కువగా వుండేట్టు చూసుకోవాలి.

-సుబ్బలక్ష్మి