సబ్ ఫీచర్

ఇసుక రుచే వేరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనకు ఆకలేస్తే వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యి, పచ్చడి, కూర కలుపుకొని కడుపునిండా తింటాం. పదార్థాలు రుచిగా ఉంటే మరో నాలుగు ముద్దలు లాగించేస్తాం. ఇవీ దొరక్కపోతే దోశ, ఇడ్లీ, ఉప్పా వంటి అల్పాహారాలను తింటాం. కాని ఈ 92ఏళ్ల సుదామాదేవి మాత్రం ఇసుక తినేస్తోంది. రోజుకు కిలో చొప్పున ఇసుక తిని తన ఆకలి తీర్చుకుంటుంది. పేదరికం కారణంగా అన్నం లభించక సుదామాదేవి ఈ పని చేయటం లేదు. ఆమె ఆహారమే ఇసుక. దీన్ని తప్పించి మరొకటి తీసుకోదు. విచిత్రంగా అనిపించే ఈ ఆహారపు అలవాటు ఆమెకు 10ఏటనే అలవడింది. ఎవరైనా క్యారెట్ లేదా మరేదైనా ఇచ్చినా దాన్ని కూడా ఇసుకలో ముంచుకుని తింటుంది. స్నేహితురాళ్లతో తాను ఇసుక తిని చూపిస్తానని పందెం కాసింది. అలా ఆరోజు ఇసుక తిన్న సుదామాదేవి దాని రుచి అమోఘంగా అనిపించిందేమో రోజూ ఇసుకనే ఆహారంగా తీసుకోవటం అలవాటు చేసుకుంది. ఇసుక ఆహారం కాదని తెలుసు. అయినప్పటికీ ఆరోగ్యకరమై ఆహారపు అలవాటుగా మార్చుకున్నాను అని సుదామాదేవి బోసినోటితో చెబుతోంది.
పెళ్లికూతురు ఇసుక తింటుందని ఎగతాళి..
ఉత్తరప్రదేశ్‌లోని ఓ మారుమూల గ్రామమైన కజ్రినూపుర్‌కు చెందిన సుదామాకు పెళ్లయిన తరువాత అత్తవారింటికి వచ్చింది. కొత్త పెళ్లికూతురిని చూడటానికి వచ్చిన చుట్టుపక్కల అమ్మలక్కలంతా సుదామాదేవి ఇసుక తినటం చూసి ‘‘ కొత్త పెళ్లికూతురు ఇసుక తింటుంది’’ అని ఎగతాళి చేసేవారు. ఊరంతా చెప్పుకునేవారు. చుట్టుపక్కలవారి ఎగతాళి మాటలకు సిగ్గుతో అత్తింటివారు ఆమె ఆలవాటును మార్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఎవరెంత చెప్పినా ససేమిరా సుదామాదేవి తన అలవాటును మార్చుకోలేదు.
పదేళ్ల వయసులో అలవాటు..పదిమంది పిల్లలు పుట్టినా మానలేదు
సుదామాదేవికి పదిమంది పిల్లలు పుట్టారు. ఇందులో ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇపుడు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమార్తె మాత్రమే జీవించి ఉన్నారు. అదృష్టం కొద్దీ పిల్లలకు ఇసుక తినే అలవాటు రాలేదు. వీరంతా సుష్టిగా భోంచేస్తారు. పెళ్లికి ముందు ఇసుకను ఇంట్లో ధాన్యం బస్తాలు వేసుకున్నట్లు తండ్రి లేదా సోదరుడు అమర్చేవారు. పెళ్లయిన తరువాత భర్త కృష్ణకుమార్ ఇసుక బస్తాలను తీసుకువచ్చి ఇంట్లో నింపుతాడు.
రోజుకు నాలుగుప్లేట్ల ఇసుక .. వైద్యులు సైతం ఆశ్చర్యం
సుదామాదేవి రోజుకు కిలో ఇసుకను నాలుగు ప్లేట్ల చొప్పున రోజంతా తీసుకుంటుంది. ఒక్కొక్కసారి నీళ్లల్లో కలుపుకుని తాగేస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి జబ్బుపడకపోవటం వైద్యులను సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇపుడు ఆమె వయసు 92. అంటే దాదాపు 80 ఏళ్ల నుంచి ఇసుకను తింటున్న ఆమె ఆరోగ్యంలో ఎలాంటి మార్పులేదని, చక్కగా ఉందని వైద్యులు సైతం చెబుతున్నారు. ఒకవేళ ఇసుక తినకపోతే ఆమెకు ఆకలే వేయదట. ఆకలేస్తుందని ఏరోజు కూడా వైద్యుని వద్దకు వెళ్లిన సందర్భమే కలుగలేదని భర్త సైతం అంటున్నాడు. శారీరకంగా ఆరోగ్యంగా ఉందని వైద్యులు సైతం ధృవీకరించారు.
*