సబ్ ఫీచర్

అక్వేరియంతో ఆహ్లాదం, ఆనందం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇళ్లలో ప్రేమగా జంతువులను ఎలా పెంచుకుంటామో.. కొందరు అక్వేరియంలో చేపల్ని కూడా అలానే పెంచుతారు.. మరికొందరేమో ఇంటి అందానికి అక్వేరియం పెట్టుకుంటారు. ఏదేమైనా అక్వేరియం ఇంట్లో ఉంటే మనకు ఉపయోగాలు కూడా ఉన్నాయట.. ఈదుతున్న చేప పిల్లలను కాసేపు చూస్తూ కూర్చుంటే అలసిన మనసుకు కాస్త విశ్రాంతి దొరుకుతుందని దైనందిన వ్యవహారాలతో సొలసిన తరణంలో స్వేచ్ఛగా తిరుగాడే అమీనాల కేసి చూసే ఒక్క క్షణం వీక్షణం మన ఆలోచనల్లో మార్పు తెస్తుందని శాస్తజ్ఞ్రులు అంటారు.
ఎలాంటి చేపలు
అక్వేరియం చేపలలో ఎన్నో రకాలున్నాయి. గోల్డ్ఫిష్, బ్లాక్ మాలిష్, ఫైటర్ ఎంజెల్స్, బార్బ్స్, రాస్, బోరాస్, చెర్సీ బార్బ్, గోల్డెన్, బార్బ్ ఫైవ్, బాండెడ్, బార్బ్, హార్లేక్వీన్, కారిడొరాస్, క్యాట్‌ఫిష్, ఆల్బినో, పెప్పర్డ్, కారిడొరాస్, డానియోస్, లియోఫర్డ్, డానియోస్, రకాలు అక్వేరియాలకు ఉపకరిస్తాయి. ఇక రెడ్ టైల్డ్, క్యాట్ ఫిష్, పెడిల్ ఫిష్, సౌత్ అమెరికన్ లీఫ్, ఫిస్ పెద్ద పెద్ద అక్వేరియాలకు మాత్రమే పనికివస్తాయి. హోం మెరైన్ అక్వేరియంలో బ్రిటిల్, స్టార్స్ చేపలను అధికంగా ఉపయోగిస్తారు. అయితే ఉప్పు శాతం పిహెచ్, రేడియో ఇతర రసాయన ప్రమాణాలు సరైన పాళ్ళలో వుండాలి. లేకపోతే బ్రిటిల్, స్టార్స్, చనిపోయే అవకాశం వుంటుంది. ఇటీవల ఒపహా అనే వేడి రక్తం కలిగిన ఉన్న చేపలను శాస్తవ్రేత్తలు గుర్తించారు. ప్రపంచంలో ఒపహా చేప ఒక్కటే వేడి రక్త కలిగిన చేప. ఇకపోతే మనం ఎన్నో రకాల చేపలను అక్వేరియంలో చూస్తుంటాం. కాని హాఫ్ మూన్ బెట్ట చేపలు మాత్రం అక్వేరిం చేపలలో మహారాణుల వంటివి అని చెప్పవచ్చు. ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగులలో ఆ చేపలు దొరుకుతాయి. విచిత్రం ఏమిటంటే హాఫ్ మూన్ బెట్ట చేపలు తోక విసినకర్ర మాదిరిగా ఉండి ఇట్టే ఆకట్టుకుంటుంది.
అక్వేరియంలో ఉంచాల్సిన దానికన్నా ఎక్కువ చేపలు ఉంచినట్టయితే చేపల విసర్జితాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి నీటిలో అమ్మోనియాను తయారుచేస్తాయి. ఈ పదార్థం చేపలకు చాలా హానికరం. మొత్తం అక్వేరియం నీటిని మార్చటం సరైన పద్ధతి కాదు. గాజు గోడలను స్క్రబ్బర్‌తో క్లీన్ చేసి, ఒక పొడుగాటి గొట్టంతో నీటి అడుగున వున్న చెత్త, చేపల విసర్జితాలు మొదలైనవి తీసివెయ్యాలి. సగానికి పైగా నీటిని తీసివేసి అప్పుడు కొత్త నీరు పొయ్యాలి. చేపలను డైరెక్టుగా నెట్ అవుట్ చెయ్యకుండా ఒక నీళ్లు వున్న కంటైనర్ సహాయంతో బయటకు తీస్తే మంచిది. లేదంటే కొన్ని చేపలు అభద్రతకు లోనవుతాయి. రసాయన సమతుల్యం లోపించడవంల్ల బ్యాక్టీరియా విపరీతంగా పెరగడం చెత్తా చెదారం పేరుకుపోవడంవల్ల నీళ్ళు రంగు మారుతాయి. దీనివల్ల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. వ్యాధి నిర్మూలన కంటే నిరోధమే శ్రేయస్కరం. డ్రాప్సి, ఫిన్‌రాట్, ఫంగస్, గిల్, డిసీజ్, హోల్ ఇన్ ది హెడ్, వైట్స్ స్పాట్ వెల్వెట్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం వుంది. అక్వేరియంలోని నీటినిప్రతి పది రోజులకు ఒకసారి మార్చాలి. చేపలకు రెండు పూటలా మేత వేయాలి. రెండు జంటల చేపలకు నెలకు సుమారు రూ.30 ఖర్చవుతాయి. నీటిని కూడా తరచూ మార్చుతూ వుండాలి. చిన్నది అయితే రెండు రోజులకు ఓ మారు మార్చుతూ వుండాలి. పెద్దది అయితే వారానికి ఓసారి మార్చినా ఫర్వాలేదు. అక్వేరియంను ఇంట్లో ఏర్పాటు చేసుకోవడంవల్ల సంపద, ఆరోగ్యం కలుగుతుందని ఫెంగ్ షుయ్ చెబుతోంది. విలాసవంతానికి ఇంట్లో ఉల్లాసభరితమైన శక్తికి కూడా అక్వేరియం ఏర్పాటు ఇటీవల విరివిగా పెరుగుతోంది. లివింగ్ రూమ్‌లోనూ, రూమ్ పార్టిషన్స్‌గా ఏర్పాటుచేసుకునే అక్వేరియం ఇంటి అందాన్ని పెంచడంలో మొదటి స్థానంలో వుంటుంది.

రక్తపోటు తగ్గుతుంది..
అక్వేరియం చేపలు ఉండే ట్యాంకులు చూస్తూ ఉంటే రక్తపోటు కాస్త తగ్గుతుందట. యూకెలోని నేషనల్ మెరైన్ అక్వేరియం ప్లేవౌత్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్‌టర్‌కి చెంది న పలువురు నిపుణులైన పరిశోధకులు సర్వే ద్వారా ఈ అంశాన్ని వెల్లడించారు. చిన్న అక్వేరియం దగ్గరనుంచి పెద్ద పెద్ద చేపల అక్వేరియాల వరకు రకరకాల పరిశోధనలు చేశారు. ఈ అధ్యయనం ఎన్విరాన్‌మెంట్ అండ్ బిహేవియర్ అనే జర్నల్‌లో ప్రచురితమైంది. సొగసైన కదలికలు, చిత్రమైన శరీరాకృతులు, ఆకర్షణీయమైన రంగులద్దుకొన్న చేపల అక్వేరియం కనువిందు చేస్తోంది. హోటళ్లు, పార్కులు, ప్రైవేటు బ్యాంకులు, కార్పొరేట్ కార్యాలయాలకు రంగు చేపలున్న అక్వేరియంలో అదనపు ఆకర్షణ మంచినీటిలో పెరిగే అందమైన రంగు చేపల పెంపకం ఈనాటిదికాదు.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈ కింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి