సబ్ ఫీచర్

నేతన్న నేత్రాల్లో వెలుగురేఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతివ అందానికీ, హుందాతనానికీ చిరునామాగా నిలిచే నేత వస్త్రాలు నేసే కార్మికుల నేత్రాల్లో వెలుగురేఖలు పూయిస్తోంది ఆమె. గత 25 ఏళ్లుగా నేత కార్మికులను ఒకచోటకు చేర్చి వారికి జీవనోపాధి కల్పిస్తూ .. తానూ స్వశక్తితో బతుకుతోంది యార్లగడ్డ రజని. నేతకార్మికులకు నెలవైన ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలకు చెందిన యార్లగడ్డ రజని హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు చేనేత ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నేత కార్మికులను ఒక్కచోటకు చేర్చారు. సంప్రదాయ వస్త్రాలకు ప్రాధాన్యతనిస్తూ ఆమె గత 25 ఏళ్లుగా నేత చీరల వ్యాపారమే చేస్తున్నారు. ఎవరింట్లో శుభకార్యానికి వెళ్లినా ఆరు మీటర్ల చీర ధరించి కట్టూ,బొట్టూతో వెళితే ఆ మహిళ ఆ వేడుకలో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది. కాని ఆ ఆరుమీటర్ల చీరను తయారుచేయటానికి చేనేత కార్మికలు రెయింబవళ్లు కష్టపడతారని, వారి కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అందించాలనే సదుద్ధేశ్యంతోనూ, చేనేత చీరల ఖ్యాతిని మరింత పెంచేదిశగా ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటుచేసినట్లు ఆమె వెల్లడిస్తున్నారు. నేత చీరలకు ఆదరణ లేకపోయినప్పటికీ, ఇబ్బందులున్నాయని వాటిని తిట్టుకుంటూ కూర్చోకుండా, నేత కార్మికలు తలరాతను మార్చేందుకు ఈ వ్యాపార మార్గాన్ని ఎంచుకున్నట్లు రజనీ అంటున్నారు. నాదంటూ సొంత వ్యాపారం చేసుకుంటూ చేనేత కార్మికులను దగ్గర చేర్చుతున్నానని రజని అంటుంది.