సబ్ ఫీచర్

చామంతి..పూబంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది చామంతుల సీజన్. ఇంటిలో చామంతుల మొక్కలు అందంగా ఆహ్వానిస్తుంటే మనసుకు ఎంత హాయిగా ఉంటుందో కదా! సిట్టింగ్ రూమ్‌లోగానీ, బెడ్‌రూమ్ పక్కన గానీ పూదోట నడిచివచ్చినట్లుగా ఉండేటట్లు చామంతులను అరెంజ్ చేసుకుంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫ్లవర్‌వేజ్‌లో తెల్లచామంతులు అమర్చుకుంటే గదికి అందాన్ని తీసుకురావటంతో పాటు వీటి నుంచి వచ్చే పరిమళం ఊపిరితిత్తుల సమస్యలను సైతం నివారిస్తోంది. ఇండోర్ కాలుష్య నియంత్రణకు ఎంతగానో దోహదం చేస్తుందని నాసా జరిపిన సర్వేల్లోనూ వెల్లడైంది. మరింకెందుకు ఆలస్యం తెల్లని చామంతులు మీ ఇంట పరిమళాలు విరజిమ్మేందుకు ఉపక్రమించండి. చామంతులను చూస్తే చాలు చిన్ని చిన్ని పక్షులు, సీతాకోకచిలుకలు సైతం వచ్చేసి చిన్నారులతో చిందేస్తాయి. ఒకటి నుంచి మూడు అడుగులు ఎత్తుమాత్రమే పెరిగే వీటి విత్తనాలు వేసిన 10 నుంచి 18 రోజులలోనే మొక్కలు వస్తాయి. వీటికి 16 నుంచి 21 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటే చాలు. విత్తనాలు విత్తిన తరువాత అవసరమైన మేరకే నీరు పోస్తూ, మట్టి ఆరిపోకుండా చూసుకుంటే చాలు. వెలుతురు విత్తిన చోట పడితే మంచిది.
కనికట్టు చేసే కార్డినల్ పువ్వులు
కాటేజ్ గార్డెన్‌కు అనువైన తోట కార్డినల్ పువ్వులు. వీటిని పెంచుకోవటం చాలు సులభం. అద్భుతమైన సింధూర పువ్వులుగా భాసిల్లే ఈ పుష్పాలు కిటికీల పక్కన అందంగా ఒదిగిపోతాయి. నాలుగడుగులు ఎత్తుకు మించి పెరగవు. ఇంటిముందు లాన్‌లో నడిచే చోట వీటిని పెంచుకుంటే అక్కడ అందంగా కనువిందు చేస్తాయి. అలాగే హేంగింగ్ బాస్కెట్స్, కంటైనర్‌లలోనూ పెంచుకోవచ్చు. ఈ పూలు అందంగా విరగబూస్తే సీతాకోకచిలుకులు, పక్షులు, తేనెటీగలు తదితరమైనవి వచ్చి సందడి చేస్తాయి. ఈ పువ్వులు పెరగటానికి 18 నుంచి 24 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటే చాలు. విత్తనాలను లోతుగా నాటనక్కర్లేదు. నాటిన తరువాత నీరు పోస్తుండాలి. విత్తనాలు మొలకెత్తటానికి అనువుగా తక్కువ మట్టిలో నాటితే బాగుంటుంది. కుండలలో తదితరవాటిల్లో నాటితే త్వరగా మొలకెత్తవు. ఎందుకంటే సూర్యని కిరణాలు సోకితే త్వరగా పెరిగి మన ముంగిట పరిమళాలు విరజిమ్ముతాయి. అందుకే బెడ్‌రూమ్ పక్కన ఇలాంటి మొక్కలను పెంచుకుంటే ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సైతం చెబుతున్నారు.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03