సబ్ ఫీచర్

కాటన్ సిల్క్‌తో కనికట్టు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్యాషన్ ట్రెండ్స్ మారుతున్నా ఎప్పటికీ హుందాగా, నిరాడంబరంగా అందరికి నప్పే చీరలు కాటన్ సిల్క్ ప్రింటెడ్ చీరలు. ఫంక్షన్ ఏదైనా అందరి కళ్లు తిప్పుకోకుండా చేయటం ఈ చీరల ప్రత్యేకం. వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఇవి నప్పుతున్నాయి. ఈ మధ్య ఎపుడూ వచ్చే డిజైన్లలో కాకుండా పలురకాల ప్రింటెడ్ చీరలు వస్తుండటంతో యువతల దగ్గర నుంచి పెద్దవారు వరకూ వీటిపట్ల మక్కువ చూపుతున్నారు. మెహందీ ఫంక్షన్ మొదలుకుని పెళ్లిళ్ల సీజన్‌లోనూ వీటిని హాయిగా ధరంచవచ్చు. చూడచక్కని డిజైన్‌తో ఆకుపచ్చ అంచుతో అద్భుతంగా మెరిసే చీరను చూడగానే మనసుపారేసుకుంటారు. ఎథిక్ బ్లాక్ ప్రింటెడ్ చీరకు మెరూన్‌తో పాటు విభిన్న వర్ణాల్లో ఉన్న అంచు అదనపు ఆకర్షణ అయింది. బ్లాక్ మధ్యలో మెరూన్ కలర్ అద్దిన పైటంచుతో మెరిసే చీర ఎవరికైనా హుందాతనాన్ని తెచ్చిపెడుతోంది. ఆకుపచ్చ ప్రింటెడ్ కాటన్ సిల్క్ చీరకు లైట్‌కలర్ అంచుతో క్రింది భాగాన చక్కటి డిజైన్‌తో వెలిగిపోయోలా ఉంది. చీరకు పైటంచు కూడా ప్రత్యేకంగా ఉంది. మెజంటా ఉదా రంగు చీరకు లేపాక్షి తరహాలో అడుగుభాగాన అందంగా డిజైన్ చేయటంతో పాటు సన్నటి మెరూన్ కలర్ అంచుతో అద్భుతంగా ఉంది. పింక్ రంగు చీరపై లైట్‌కలర్‌లో అద్దిన డిజైన్ అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. ఏకాలంలోనైనా సీజన్‌లతో సంబంధం లేకుండా ఎవర్‌గ్రీన్ కలర్స్‌గా ఫ్యాషన్ డిజైనర్లు వీటిని పేర్కొంటారు. అరవిరిసే ఆధునిక డిజైన్లు సొంతం చేసుకున్న ఈ చీరలు అందంతో పాటు హుందాగా నలుగురిలో మిమ్మల్ని నిలబెడతాయి.

***
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో ఇ్ద్య్యౄజర్ఘీబ్ఘశజ్ద్ఘూఇ్ద్య్యౄజ.శళఆకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03