సబ్ ఫీచర్

బల్లకట్టు లేదు.. మట్టపల్లి చేరేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ జిల్లా మట్టపల్లి క్షేత్రానికి పుష్కర భక్తులు తాకిడి పెద్దగా లేదు. ఇక్కడి ముఖ్యంగా ఆంధ్రప్రాంతంనుంచి భక్తులు ఎక్కువగా వస్తారు. కృష్ణానది ఆవలివైపునుంచి బల్లకట్టుపై వారు నది దాటి ఇక్కడకు రావడం సంప్రదాయం. రోడ్డుమార్గంలో రావాలంటే రెండుమూడు గంటలపాటు వంద కిలోమీటర్లు ప్రయాణించి వ్యయప్రయాసలతో రావాల్సి ఉంటుంది. అదే బల్లకట్టు అయితే త్వరగా, స్వల్పవ్యయంతో రావచ్చు. పైగా నదిలో విహరించినట్టూ ఉంటుంది. అయితే భద్రతాచర్యల్లో భాగంగా బల్లకట్టును నిషేధించారు. దీంతో ఆంధ్రనుంచి రావలసిన వేలాదిమంది ఇబ్బంది పడుతున్నారు. చుట్టూ తిరిగి రాలేక, ఎదురుగా ఉన్న ఘాట్‌కు చేరుకోలేక నానా అవస్థ పడుతున్నారు. మట్టపల్లికి వెళ్లివచ్చేందుకు అక్కడి భక్తులకు ఏపీ కులసంఘాలు భారీమొత్తంలో నిధులు సమకూరుస్తాయి. ఈ క్షేత్రంపై ఉన్న మమకారంతో వారు ఇక్కడికి వస్తూంటారు. అధికారులు స్పందించి బల్లకట్టుపై పరిమిత సంఖ్యలో భక్తులు ప్రయాణించేలా జాగ్రత్త చర్యలు తీసుకుని అనుమతిస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు.

-ఆంధ్రభూమి విలేఖరి, మఠంపల్లి.