సబ్ ఫీచర్

సెల్యూట్ చేద్దాం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శత్రువును పసిగట్టే డేగ కళ్లు..చురుకైన చూపులు..చేతిలో తుపాకులతో కాపలాకాసే జవాన్లు. ఇది ఇండియా-నేపాల్ సరిహద్దుల్లో కనిపించే దృశ్యం. తీవ్రవాదులకు, క్రిమినల్స్‌కు ఆలవాలమైన ఈ ఓపెన్ బోర్డర్‌లో కోట్లాదిరూపాయలు విలువచేసే మాదకద్రవ్యాలు సైతం నిరంతరం రవాణా అవుతుంటాయి. సహజంగానే ఇలాంటి ప్రాంతాల్లో కనిపించే జవాన్లను పురుషులుగానే ఊహించుకుంటాం. కాని ఇక్కడ మనకు కనిపించేది మహిళా జవాన్లు. దేశంలో తొలిసారిగా‘ సశస్త్ర సీమ బాల్’ పారా మిలటరీ ఫోర్స్‌లో మహిళలకు సైతం భాగస్వామ్యం కల్పించారు. ఈ విభాగంలో శిక్షణ తీసుకున్న మహిళా జవాన్లు నేడు దేశంలో కీలకమైన ఈ సరిహద్దు ప్రాంతాలలో సేవలందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బహారైచ్ ప్రాంతంలోనూ మహిళా జవానే్ల పహారాచేస్తుంటారు. వీరిని 2008లో నియమించారు. నిర్భీతితో పహారాకాసే ఈ మహిళా జవాన్లకు సరిహద్దు ప్రాంతాలే ఇళ్లుగా మారాయి. దాదాపు 1750 కిలోమీటర్ల మేరకు చీమచిటుక్కుమన్నా అప్రమత్తమవుతారు. ఈ సరహద్దు ప్రాంతంలో గత రెండు దశాబ్దాల నుంచి తీవ్రవాదులకు, క్రిమినల్స్‌కు అడ్డాగా మారటమే కాదు కొకైన్, బ్రౌన్‌షుగుర్‌లాంటి మాదకద్రవ్యాలు, మనుషుల అక్రమ రవాణా జరుగుతుంటోంది. ఈ నేపథ్యంలో మహిళా జవాన్లను ఇక్కడ నియమించటం సర్వత్రా చర్చినీయాంశమైనప్పటికీ పురుష జవాన్ల కంటే తామేమి తీసిపోమంటూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు.
ఎలా పనిచేస్తారు?
ప్రతిరోజూ రాత్రి పెట్రోలింగ్ నిర్వహించే ముందు జవాన్లతో కమాండర్ సమావేశమై సంక్షిప్త స్ఫూర్తిదాయకమైన సందేశమిస్తారు. ఆమె సందేశం ఆలకించిన తరువాత ఎవరికి వారు తమకు కేటాయంచిన ప్రాంతాలలో విధుల్లో నిమగ్నమవుతారు. ప్రతిరోజూ జాయింట్ పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తారు. సరిహద్దులో రోజూ ఉదయం ఆరు గంటలకు చెకింగ్ ప్రారంభమవుతోంది. ప్రస్తుతం ఇక్కడ మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల స్మగ్గింగ్‌ను సైతం అడ్డుకట్టవేయగలిగామని టీమ్ లీడర్ మున్నీదేవి అంటున్నారు. తొలి పోస్టింగ్‌లో ఎనిమిది వందల మహిళా జవాన్లను నియమించారు. ఈ సంఖ్యను మరింత పెంచితే ఛాలెంజ్‌గా విధులు నిర్వహిస్తామని ఎస్‌ఎస్‌బి తొలి మహిళా సూపరిండెంట్ అర్చనా రామసుందరం వెల్లడించారు. కటిక చీకటిలో.. నిర్మానుష్యమైన సరిహద్దు ప్రాంతాన్ని తమ ఇంటిగా భావిస్తూ విధి నిర్వహణ చేస్తున్న మహిళా జవాన్లకు స్థానికులు సైతం సెల్యూట్ చేస్తుంటారు.