సబ్ ఫీచర్

చిన్నారి నడకకు చేయూతనివ్వండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చీరాని మాటలతో పాకే పిల్లలు ఏదైనా పట్టుకొని నడిచేందుకు ప్రయత్నిస్తే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. ఎందుకంటే లేత ఎముకులకు దెబ్బలుతగులుతాయని భయపడతారు. కాని నడవాలని ప్రయత్నించే పిల్లలకు చేతులు అందించి నడిపిస్తే వారి ఎముకలలో పటుత్వం పెరుగుతుందని బ్రిటన్‌లో నిర్వహించిన అధ్యయనాల్లో వెల్లడైంది. పసిబిడ్డలు 18 నెలల వయసురాగానే బుడిబుడి అడుగులు వేయటానికి ఉత్సాహం చూపిస్తారు. అంతేకాదు ఏదైనా పట్టుకుని ముందుకు వెనక్కి తూలుతూ అడుగులు వేయటానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు పరుగులు పెట్టటానికి, జంప్ చేయటానికి సైతం వెనుకాడరు. అలాంటప్పుడు భయపడకుండా నిదానంగా వారిని చేయందిస్తే ఎంతో మంచిదట. ఎందుకంటే ఈ సమయంలో కీళ్లు, ఎముకులు గట్టిపడతాయట. ఈ విధంగా చేయటం వల్ల వారికి 16 ఏళ్ల వయసు వచ్చేసరికి వారి ఎముకలలో దృఢత్వం మరింత మెరుగవుతోందని బ్రిటన్‌కు చెందిన మాంచిస్టెర్ మెట్రోపొలిటియన్ యూనివర్శిటీ అధ్యాపకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. యుక్తవయసులో వారు పరుగెత్తటానికి, జంప్ చేయటానికి కండరాలు పటిష్టంగా తయారవుతాయి. పసిప్రాయంలో నడక వల్ల ఎముకల్లో ఒత్తిడి పెరిగి కీలక విభాగాలు మందంగా పటిష్టంగా తయారవుతాయి. పసిబిడ్డలుగా ఉన్నపుడు వారు ఎంత ఎక్కువగా ఆడుకంటే ఎముకలు పటిష్టంగా తయారై 17 ఏళ్లు వచ్చేసరికి వారిలో ఆ దృఢత్వానికి దారితీస్తోంది. యుక్తవయసులో ఎముకలు విరిగినా వెంటనే అతుక్కునే అవకాశం మెండుగా ఉంటుంది. కాబట్టి 18 నెలల పిల్లలు పరుగులు పెడుతున్నా, జంప్ చేయాలని ఉత్సాహపడతున్నా ఆపకుండా చేయూత నివ్వమని డాక్టర్ అలెక్స్ ఐర్లాండ్ సూచిస్తున్నారు. దాదాపు 2,327మంది పిల్లలపై వీరు అధ్యయనం చేశారు. పసిబిడ్డలను ఆనందంగా, ఉత్సాహంగా ఆడుకోవటానికి ప్రాధాన్యమివ్వమని సలహా ఇస్తున్నారు.