సబ్ ఫీచర్

నాన్నకు ప్రేమతో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మరో వారం రోజులలో పెళ్లి పీటల మీదకు ఎక్కాల్సిన వధువు .. హఠాత్తుగా నాకీ పెళ్లి వద్దు నాన్నా..’’అని ధైర్యంగా చెప్పగలదా?. అమ్మో! అని అంటారు చాలా మంది ఆధునిక యువతులు. కాని రాజస్థాన్‌లోని భారతి యాదవ్ అనే 24 ఏళ్ల టీచర్ మాత్రం ధైర్యంగా, నిర్మోహమాటంగా నాకీ పెళ్లి వద్దని తెగేసి చెప్పటమే కాదు నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి పెళ్లికొడుకు మీద వరకట్న కేసు కూడా పెట్టింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ఫైతాపురా గ్రామంలో ఫిబ్రవరి 22న భారతి యాదవ్ అనే టీచర్ వివాహం జరగాల్సి ఉంది. హఠాత్తుగా పెళ్లి కొడుక్కి కారు కావాలనే కోరిక మదిలో తలెత్తింది. హాయిగా.. జాలీగా తిరగటానికి కారు ఉంటే బాగుండనని అనిపించిందేమో.. వెంటనే కాబోయో మామగార్ని పిలిచి కట్న కానుకల కింద బైక్ ఇస్తామన్నారు కదా! దాని బదులు కారు ఇవ్వండని ఆజ్ఞజారీ చేశాడు. ఆరు నెలల్లో కారు కొనిస్తామని ప్రాంసరీ నోటు రాసిస్తేనే తాళి కడతాను లేకపోతే పెళ్లి క్యాన్సిల్ అని బెదిరించాడు. అంత స్థోమత లేని ఆ తండ్రి గుడ్ల నీళ్లు పెట్టుకుంటూ ఇంటికి చేరాడు. కన్న తండ్రి బాధ చూడలేక 24 ఏళ్ల భారతి యాదవ్ సరాసరి పోలీసు స్టేషన్‌కు వెళ్లి పెళ్లి కొడుకు మీద వరకట్న కేసు పెట్టటడమే కాకుండా నాకీ పెళ్లి వద్దు నాన్నా.. అంటూ ఓదార్చింది. 1961లో వచ్చిన వరకట్న నిషేధ చట్టానికి అర్ధ శతాబ్దం వయసు దాటినా ఈ చట్టం ఆధారంగా కేసులు పెట్టే భారతిలాంటి వారే కరువయ్యారు. ఆడపిల్లలు పెళ్ళిల్లు చేయలేక, అల్లుళ్ళ అలవికాని కోరికలు తీర్చలేక ఎంతోమంది తల్లిదండ్రులతో పాటు, పెళ్లి కుమార్తెలు సైతం కుమిలిపోవటమో లేదా ఆత్మహత్యలకు పాల్పడమో చేస్తున్నారే తప్పా భారతదేశంలో భారతిలాంటి వనితలు ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. ఏదిఏమైనప్పటికీ భారతికి హెట్పాఫ్..!