Others

భైరవద్వీపం -- నాకు నచ్చిన సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జానపద శైలిలో జనరంజక చిత్రాలను నిర్మాతలు నిర్మిస్తే -ప్రేక్షకులు కాసుల వర్షం కురిపించారు. జగదేకవీరుని కథ, చంద్రహారం లాంటి జానపదాలు ప్రేక్షకులను సినీ స్వర్ణయుగంలో మురిపించాయి. నాగిరెడ్డి, చక్రపాణిల ఆధ్వర్యంలో అనేక చిత్రాలకు దర్శకత్వం వహించిన కెవి రెడ్డి గొప్ప జానపద చిత్రాలు ఎన్నో నిర్మించారు.
ఇక ఆధునిక సినిమా యుగంలో -రచయిత, నటుడు రావికొండలరావు సహాయ సహకారాలతో ‘్భరవద్వీపం’ తీశారు. రాజు, మాంత్రికుడు, నాయకానాయికలు, హాస్య పాత్రలు, సాహసోపేతమైన యుద్ధాలు, జనాల నోట సదా పలికే పాటలు జానపదాలకు పెట్టనికోటలు. బాలకృష్ణ, రోజా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో అన్ని హంగులూ ఉన్నాయి. అమ్మా శాంభవి అనే పాట కెఆర్ విజయపై చిత్రీకరించిన విధానం అద్భుతం. ‘శ్రీతుంబుర నారద నాదామృతం’ పాట ఒక ఆణిముత్యం. బాబుమోహన్ తన వింతైన భాషతో నవ్వించారు. కత్తియుద్ధాలు, జలపాతాలు, గుర్రపుస్వారీలు, గూడేలలోవుండే ఆటవిక నృత్యాలు, వాళ్ల భాష ఈ చిత్రంలో సహజంగా ఉంటాయి. సింగీతం శ్రీనివాసరావు ప్రతిభ, సినీ సాంకేతిక పరిజ్ఞానం మిళితమే విజయావారి భైరవద్వీపానికి అఖండ కీర్తి తెచ్చిపెట్టాయి. నందమూరి వారసుడిగా బాలకృష్ణ కెరీర్‌లో ఇదో గొప్ప సినిమాగా చెప్పుకోవచ్చు.
-బొడ్డపాటి రాజేశ్వరమూర్తి, చిలకలపూడి