రాష్ట్రీయం

ఓయూలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీఫ్ ఫెస్టివల్‌పై రౌండ్ టేబుల్ సమావేశం
అనుకూల, ప్రతికూల నినాదాలు
ఎంబిటి నేతను అరెస్ట్ చేసిన పోలీసులు
బీఫ్ ఫెస్టివల్‌కు అనుమతి లేదని స్పష్టీకరణ
వారం రోజులపాటు నిషేధాజ్ఞలు

హైదరాబాద్, డిసెంబర్ 5: ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 10న నిర్వహించతలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌పై ఉద్రిక్తత చోటుచేసుకుంది. శనివారం ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహణపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ మాజీ రాజ్యసభ సభ్యుడు అజీజ్ పాషా, సిపిఎం రాష్ట్ర నాయకురాలు మల్లు స్వరాజ్యం, పిడబ్ల్యుఓ రాష్ట్ర కార్యదర్శి సంధ్యతోపాటు బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులు స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి హాజరయ్యేందుకు పాతబస్తీ నుంచి బయలుదేరిన మజ్లిస్ బచావో తహరిక్ (ఎంబిటి) రాష్ట్ర నేత అమ్జదుల్లాఖాన్‌ను సౌత్‌జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఓ వైపు బీఫ్ ఫెస్టివల్‌కు మద్దతుగా రౌండ్‌టేబుల్ సమావేశం కొనసాగుతుండగా మరోవైపు కొందరు ఫెస్టివల్‌ను వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తుండటంతో ఓయూలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈనెల 10న వామపక్ష దళిత మైనార్టీ విద్యార్థి సంఘాలు నిర్వహించ తలపెట్టిన బీఫ్, పోర్క్ ఫెస్టివల్‌కు ఏలాంటి అనుమతిలేదని నగర పోలీసులు స్పష్టం చేశారు. ఓయూ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ వారం రోజులపాటు అమలులో ఉంటుందని పేర్కొన్నారు.
శాంతి భద్రతల దృష్ట్యా ఈనెల 12వ తేదీ వరకు ఎలాంటి ఉత్సవాలకు అనుమతించడంలేదని ఈస్ట్ జోన్ డిసిపి డాక్టర్ వి.రవీందర్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు సహకరించాలని ఆయన కోరారు. శాంతి,్భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని డిసిపి హెచ్చరించారు.