రాష్ట్రీయం

కెసిఆర్ చాందసవాదంతో బంగారు తెలంగాణ ఎలా సాధ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజా సమస్యలపై ప్రణాళికాబద్ధంగా ఉద్యమిస్తాం
కేరళ తరహాలో రైతు రుణ మాఫీ చట్టం తేవాలి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

సంగారెడ్డి, నవంబర్ 30: గుళ్లు, గోపురాలు, యజ్ఞ యాగాదుల వంటి చాందసవాద కార్యక్రమాల నిర్వహణతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బంగారు తెలంగాణాను ఏ విధంగా సాధిస్తారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. వరంగల్ ఉప ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటు కొనసాగిందని, టిఆర్‌ఎస్‌కు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెరుగైన సంక్షేమ పథకాలను అందజేయాలని సూంచారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి, వామపక్షాలు జత కట్టాలన్న ఆలోచనను తోసిపుచ్చారు. టిఆర్‌ఎస్‌ను వ్యతిరేకించడం కాదు ప్రపంచ బ్యాంకు విధానాలను, అప్రజాస్వామికి విధానాలను, చాందసవాదాన్ని వ్యతిరేకించాలన్నారు. వ్య క్తులను కాదు కాంగ్రెస్, టిడిపిల్లోనూ టిఆర్‌ఎస్‌కున్న భావజాలమే ఇమిడివుందన్నారు. భవిషత్తులోనూ సిపిఎంతో ఇతర పార్టీలతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తులు ఉండవన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే వారిని ఓడించాలన్న లక్ష్యంతో సిపిఎం పనిచేస్తుందన్నారు. పార్టీలో అంతర్గత చర్చల ద్వారా భవిషత్ కార్యాచరణపై విశే్లషణ చేసుకుంటున్నామన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం తదితరులు పాల్గొన్నారు.