రాష్ట్రీయం

విద్యార్థినిపై యువకుడు సుత్తితో దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: నగరంలో ఓ యువకుడు విద్యార్థినిపై సుత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన వెంకటరమణకు తల్లిదండ్రులు లేరు. ఆమె తన బంధువుల సహాయంతో మహిళా ప్రాంగణంలో ఉంటూ గుంటూరులోని మహిళా కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇవాళ ఉదయం కళాశాలకు చేరుకోగా... సైకిళ్లు నిలుపుదల చేసే ప్రదేశంలో ఓ యువకుడు తనతో పాటు తీసుకొచ్చిన సుత్తితో ఆమెపై దాడి చేసి ఉడాయించాడు. విద్యార్థిని ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.