రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల్లో ‘ఆటా’ సేవా కార్యక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: తెలుగు జాతి వైభవాన్ని సంస్కృతి, సంప్రదాలను భావితరాలకు చాటి చెప్పేలా అమెరిన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) వచ్చే సంవత్సరం రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలను ప్రారంభించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. శనివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ‘ఆటా’ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి అసిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రత్యేక సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు, విద్యా సదస్సులు, మహిళా సాధికారత, వాణిజ్య సదస్సులు, కేన్సర్, హెచ్‌ఐవి సోకిన అనాధ చిన్నారులకు ఆర్థిక సహాకారం, బాలికల సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా బాలిక సంరక్షణపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించేందుకు గాను ఈ నెల 19న నెక్లెస్‌రోడ్డులో 5కె రన్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 7నుంచి తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాకేంద్రాల్లోనూ వైద్య శిబిరాలను నిర్వహిస్తామన్నారు. ఏపిలో 12న విశాఖపట్నంలో వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 12న విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, 15న హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యా సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్ అనే యువకుడికి వైద్య ఖర్చుల కోసం 17 లక్షల రూపాయల విరాళాన్ని అందించనున్నట్లు తెలిపారు.