రాష్ట్రీయం

పిచ్చాటూరు డ్యామ్‌నుంచి జలాల క్రమబద్ధీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడుకు ఏపి సర్కార్ సాయం
హైదరాబాద్, డిసెంబర్ 3: చెన్నై పరిస్థితి చూసిన వారెవరికైనా గుండె చెరువు కాకమానదు. ఈ క్రమంలో రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న డ్యాంల నుండి మరింత నీరు విడుదల కాకుండా తమిళనాడు ప్రభుత్వం పొరుగు రాష్ట్రాల సహకారాన్ని కోరుతోంది. ఆంధ్రా నుండి కూడా చిత్తూరు జిల్లా పిచ్చటూరు డ్యాం నుండి వరదనీరు చెన్నై సరిహద్దులోకి ప్రవేశిస్తే తిరువళ్లూరు జిల్లా మళ్లీ నీటి సంద్రం అవుతుందని భావించిన ప్రభుత్వం కొంతకాలం పాటు డ్యాం నుండి వరద నీరు విడిచిపెట్టకుండా ఆపాలని కోరింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏపి సిఎం ముఖ్య కార్యదర్శికి ఫోన్ చేసి కోరడంతో దానికి రాష్ట్రప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పిచ్చాటూరు డ్యాం నుండి విడిచిపెడుతున్న జలాలను తగ్గించే వీలుందేమో పరిశీలించాల్సిందిగా సిఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడారు. ఎపి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చీఫ్ సెక్రటరీ పేర్కొన్నారు. వరద నీటిని ఆపితే డ్యామ్‌కే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున వరద జలాలను క్రమబద్ధీకరించి, తమిళనాడుకు చేరకుండా నిరోధించే ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఆంధ్రాప్రభుత్వం సకాలంలో స్పందించడంపై తమిళనాడు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది.