రాష్ట్రీయం

రాష్ట్రానికి బీజేపీ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 16: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ - జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావటం తథ్యమని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. రాష్ట్రానికి బీజేపీ అవసరం ఎంతో ఉందని, ప్రధాని మోదీ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. 2014లో మోదీతో కలిసి తాను గాంధీనగర్ వెళ్లానని గుర్తుచేశారు. అవినీతి రహిత నాయకత్వం కేంద్రంలో ఉన్నప్పుడే ఏపీకి లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో తమమధ్య సమన్వయ లోపం ఏర్పడిందని, అయితే కొద్దికాలంగా ఈ దూరం ఎక్కడ, ఎలా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నాలు చేశామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిసి పనిచేయాలని అనుకున్నామని, స్థానిక సంస్థ ఎన్నికల నుంచి 2024 ఎన్నికల వరకు కలిసి సాగుతామని గురువారం నగరంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. అవినీతి, కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని నిర్ణయించామన్నారు. 2015లోనే తాను చంద్రబాబును కలిసి 33వేల ఎకరాల భూమి సేకరించారు, తర్వాత కొత్త ప్రభుత్వం వస్తే ఏమి చేస్తారని కూడా అడిగానని తెలిపారు. ఏదిఏమైనా రైతుల కోసం టీడీపీ బలంగా నిలబడలేక పోయిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి షరతులు లేకుండా బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నారు. కర్నూలులో హైకోర్టు పెడితే అక్కడ అభివృద్ధి జరగబోదని, హైకోర్టు మాత్రమే పెట్టి సీమకు రాజధాని వచ్చిందంటే కుదరదన్నారు. బీజేపీ, జనసేన మధ్య భవిష్యత్‌లో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ కూడా రాకుండా చూసుకుంటామన్నారు. ఏపీ విభజన సమయంలో ప్రధానిగా మోదీ పార్లమెంట్‌లో లేరని, ప్రత్యేక హోదాకి టీడీపీ బాధ్యత వహించాలన్నారు. ప్రత్యేక ప్యాకేజీ తీసుకోకుండా ఉంటే హోదా గురించి అడిగే హక్కు ఉండేదన్నారు. 22మంది ఎంపీలున్న వైకాపా, టీడీపీ ఎంపీలు కూడా ఇందుకు బాధ్యత తీసుకోవాలన్నారు. వామపక్షాలకు తానేమీ బాకీలేనని, వారికంటే ముందు బీజేపీతో కలిసి పని చేశానన్నారు. సీఏఏ గురించి మాట్లాడుతూ ఏ దేశంలో ఉన్న మైనార్టీలను
ఆ దేశం సురక్షితంగా చూసుకోవాలన్న ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందన్నారు. పాక్, ఆఫ్ఘన్, బంగ్లాదేశ్‌లలో హిందూ మైనార్టీలను రక్షించడానికి నాడు గాంధీ, నెహ్రూ, వామపక్షాల నేతలు ఏమిచెప్పారో గర్తుంచుకోవాలన్నారు. పాక్ మొదటి న్యాయశాఖ మంత్రి ఒక దళితుడని, ఆయనే కాందిశీకునిగా భారత్ వచ్చారని పవన్‌కళ్యాణ్ వివరించారు.

'చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న పవన్‌కళ్యాణ్