రాష్ట్రీయం

అగ్రిగోల్డ్ కేసులో విచారణ 30కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 26: అగ్రిగోల్డ్ కేసు విచారణను రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ఎస్‌వి భట్‌లతో కూడిన బెంచ్ సోమవారానికి వాయిదా వేసింది. అగ్రిగోల్డు భూముల వేలం బాధ్యత నెరవేర్చేందుకు ఎంపిక చేసిన సి1 ఇండియా ప్రైవేటు లిమిటెడ్ తమకు అధీకృతం చేసిన కమిషన్‌పై గురువారం నాడు అభ్యంతరం వ్యక్తం చేసింది. మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన హైకోర్టు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ వేలం వ్యవహారల బాధ్యతను సి1 కంపెనీకి అప్పగించింది. భూముల అమ్మకంపై సి1 సంస్థకు 0.2 శాతం కమిషన్ ఇవ్వాలని త్రి సభ్య కమిటీ సూచించింది. కమిషన్‌ను 0.2 శాతం నుండి 0.5 శాతానికి పెంచాలని సి1 సంస్థ హైకోర్టును కోరింది. సుమారు 20 లక్షల మంది మధ్యతరగతి ప్రజలు ఇందులో మదుపుచేశారని పేర్కోంది. ఈ నేపథ్యంలో తమ నిర్ణయాన్ని సోమవారం నాడు చెబుతామని హైకోర్టు సి1 సంస్థకు సూచించింది. కాగా అగ్రిగోల్డు మోసాలపై సిబిఐ లేదా ఇడి సంస్థలతో దర్యాప్తు నిర్వహించాలని కోరుతూ తెలంగాణ అగ్రిగోల్డ్ ఖాతాదారుల, ఏజెంట్ల సంక్షేమ సంఘం తరఫున ఎ రమేష్‌బాబు ఒక పిటీషన్‌ను దాఖలు చేశారు.