కథ

మహిళకు స్వేచ్ఛ కొంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక సభ్య సమాజంలో.. ప్రస్తుత గృహ వ్యవస్థలో మరియు వివిధ రంగాలలో దిన దిన ప్రవర్థమానవుతున్న మహిళాభ్యున్నతిని పరిశీలిస్తే అందరికి ఆదర్శప్రాయంగాను.. ఆశ్చర్యంతో హర్షించే విధంగా గొప్పగా ఉందనటంలో ఆవగింజంతైనా అతిశయోక్తి లేదు.
అందరూ ఒప్పుకోదగిన పరిణామం నాటికి, నేటికి స్ర్తిల పరిస్థితులు మారాయి. నాలుగు గోడలమధ్య వంటిల్లే స్వర్గంలా భావించే మహిళలు ఇప్పుడు జన జీవన స్రవంతిలో ఒక విశిష్టమైన శక్తిలా కలిసిపోయి అంచెలంచెలుగా ఎదుగుతున్నారు.
ముఖ్యంగా అభినందించవలసిన విషయం- విద్యారంగంలో పాఠశాల మొదలు కళాశాల వరకు బాలికలదే అగ్రస్థానం. చదువులకోసం తాత్కాలిక ఉద్యోగాలు (మెహంది, అల్లికలు, శుభకార్యాలలో పిండివంటలు తయారీదార్లుగాను, హస్తకళలు, వాహనాలు నడిపే డ్రైవర్లుగాను) ఇలా ఎన్నో మరెన్నో పనులు చేసుకుంటూ తమ కాళ్ళమీద తాము నిలబడుతూ ఉన్నత వ్యక్తిత్వంతో ప్రయోజకులైన మహిళలు నేటి భారతీయ సమాజంలో నిత్య ప్రకాశ దీపాలుగా చెమటను ఆజ్యంలా పోస్తూ దశదిశలా అఖండమైన కాంతులతో వెలిగిపోతున్నారు.
ఆనందించవలసిన విషయం ఏమిటి అంటే వృత్తి విద్యాకోర్సులు, ఉద్యోగాలలో రాజకీయాలలో స్ర్తిలకూ ప్రాముఖ్యం లభించడం. స్ర్తిలు సమంగా నేర్పుగా అంకితభావంతో గొప్పగా పనిచేయటం, వారు రాణించినంత గొప్పగా పురుషులు రాణించలేకపోవడం ఆశ్చర్యం కాకపోతే మరేమిటి?
ఇలా పలు విధాలుగా వైద్య, విద్యా, విజ్ఞాన, రాజకీయ, క్రీడా, రక్షణ రంగాలలో ఎక్కడ చూసినా, ఏ నోటవిన్నా పదును పెట్టిన ఆయుధంలా మహిళా శక్తి, యావత్ ప్రపంచం స్తంభించిపోయేలా ఉప్పెనలా పొంగి పొరలి నింగిని తాకుతున్న కెరటాలవలే ఎగసిన మహిళా స్ఫూర్తికి, ఎవరూ సాటిలేరు, పోటీ పడరు అనే విధం రాకెట్టులా ఆకాశంలో దూసుకుపోతున్న మహిళా చైతన్యం అందరూ హర్షించదగిన విషయం.
ఈ ప్రపంచంలో మహిళలు రచయిత్రులుగా, కవయిత్రులుగా ఉపన్యాసకులుగా, ఉద్యమకారిణులుగా ఉపాధ్యాయినిలుగా, గృహిణులుగా ఉన్నత ఉద్యోగస్తులుగా, మంత్రులుగా, శాసనసభ్యులుగా, న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా, ప్రాణాలను రక్షించే వైద్యులుగా, స్వచ్ఛంద సంస్థల మరియు అత్యున్నత అధికార సభలకు అధ్యక్షులుగా, ఆయా రంగాలలో వారు చేపట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎందరో మహిళలు ఆకాశంలో వెలిగే స్వయం ప్రకాశక నక్షత్రాలుగా వెలుగొందుతున్నారు.
ఇకపోతే కొన్ని గమనించవలసిన ముఖ్య విషయాలు ఏమిటి అంటే- ఇన్ని రకాలుగా అన్ని విధాలుగా ఇంత గొప్పగా ఎంతో అద్భుతంగా ఆవిష్కరించబడుతున్న ‘మహిళ పాత్ర’ సమాజంలో మమేకమవుతున్న ‘స్ర్తి అభ్యుదయం’ ఇంకా మొదట్లోనే వుంది. మొక్కగానే వుంది. ఎక్కడో ఒకచోట దాని కూకటి వేరు కత్తిరించబడుతూనే వుంది.
బాలికగా విద్యార్థినిగా, గృహిణిగా.. ఉద్యోగినిగా, మంత్రిగా ఇలా ఎన్నో విధాలుగా రూపొంతరాలు చెంది సమాజంలో భాగంగా మారినా స్ర్తి యొక్క స్వయం నిర్ణయం ఇంకా పురుషుల చేతులలోనే వున్నది. స్ర్తి పురుషులు ఇద్దరూ పరస్పర అవగాహనతో కలిసి నడవాల్సిందే. కాని నియంతృత్వ ధోరణితో కట్టిపడేయటమే మహిళా స్వేచ్ఛకు ఇబ్బందిగా అభ్యంతరకరంగా ఉంది కాని అదే జరుగుతుంది కదా. కొన్ని చోట్ల అడుగడుగునా ఆటంకాలు. అలుపెరుగని మహిళా పోరాటాలు, మహిళల ఆత్మాభిమాన అణచివేతలు.. ఆత్మవిశ్వాసానికి అవరోధం.. ఇవన్నీ.. కలిసి మహిళలను ఉప్పెనలా చుట్టుకుంటున్నాయి. తర తరాలనుండి వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఈ వ్యవస్థ కాలక్రమేణా పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో మార్పులు జరగాలి.
భార్య అంటే గృహిణిగా సేవలందించడమే కాకుండా ఉద్యోగినిగా ఆర్థిక సేవలందిస్తూ, మాతృత్వంతో సంసారాన్ని పెంచే త్రిపాత్రధారిణిగా ఉపయోగపడే యంత్రంలా ఉందనుకుంటారు. కొందరి పురుషుల ఆలోచనలు కాని అప్పుడు ఇప్పుడు ఒకే విధంగా స్ర్తిలు శ్రమిస్తూనే వున్నారు. ఎలా అంటే నిరంతర నిత్య ప్రవాహంలా మహానదులై సముద్రాలై చరిత్రపుటంలో మహిళలు సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్నారు. గృహ హింస, విడాకుల చట్టం- ఇలా ఇంకా ఎన్నో చట్టాలు స్ర్తిలకి రక్షణ కవచాలుగా ఉన్నప్పటికి సగటు స్ర్తి జీవితంలో రక్షణ కరువైందన్న కఠినమైన వాస్తవాన్ని అందరూ అంగీకరించవలసిందే.
వయస్సుతో నిమిత్తం లేకుండా స్ర్తిలపైన జరిగే అత్యాచారాలను అరికట్టే వౌలికమైన మార్పు పురుషులలో రావాలి. ఈ మార్పు ముఖ్యంగా ప్రతి ఇంటినుండి మొదలవ్వాలి. చట్టసబలో మహిళలంతా ఏకతాటిపైకొచ్చినప్పటికీ మహిళా బిల్లు ప్రవేశపెట్టడానికే ఎనె్నన్ని అవస్థలు పడ్డారో, ఎనె్నన్ని ఆటంకాలు ఎదుర్కొన్నారో యావత్ భారతావనికి తెలిసిన విషయమే. స్ర్తిల యెడల ఇలాంటి పక్షపాత ధోరణి విడనాడాలి. మహిళా సాధికారత కార్యరూపం దాల్చాలి. మాటల రూపంలోనే మిగిలిపోకూడదు.
చివరిగా నా అభిప్రాయం- ఏది ఏమైనా సగటు స్ర్తి జీవితంలో సంపూర్ణమైన, సమూలమైన మార్పు రావాలి. అత్యాచార కేసుల్లో దోషిని కఠినంగా శిక్షించాలి. ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో బ్రతుకగలగాలి. నిర్భయంగా నిర్ణయాధికారాలు చేపట్టగలగాలి. అటువంటి సమ సమాజంలో అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరించాలి.
-ఓ మహిళా! మేలుకో
పరాధీనం హేయం, మానుకో
నీ శక్తి నువ్వు తెలుసుకో
నీ గమ్యం నువ్వే చూసుకో
విజయ బావుటా చేరుకో

- డా శారదా రెడ్డి వకుల 949246166