రాష్ట్రీయం

అవినీతి కేసులో ఎసిపి సంజీవరావుకు బెయిల్ నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అరెస్టు చేసిన కూకట్‌పల్లి ఎసిపి ఎన్.సంజీవరావు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఎలెంగో డిస్మిస్ చేశారు. బెయిల్ పిటీషన్ సోమవారం విచారణకు వచ్చింది. కేసు విచారణ దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని జస్టిస్ ఎలెంగో తెలియజేశారు. ఇలాంటి కేసుల్లో 30 రోజుల్లోనే బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉందని నిందితుని తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎసిబి తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.రవికిరణ్‌రావు జోక్యం చేసుకుంటూ కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోందని, నిందితుడి ఆస్తుల వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నందున ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనలు విన్న జస్టిస్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించి, ఆ పిటీషన్‌ను ఉపసంహరించుకోవాలని ఆదేశిస్తూ డిస్మిస్ చేశారు.