రాష్ట్రీయం

ఉమ్మడిగా చెనాక ఆనకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మాణానికి మహారాష్టత్రో ఒప్పందం * 368 కోట్లు విడుదలకు సిఎం ఓకే
హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు కింద నిర్మించే చెనాక కోర్ట బ్యారేజీ పనుల ప్రారంభానికి ఆమోదముద్ర పడింది. ప్రాజెక్టు కోసం తెలంగాణ వాటా కింద 368 కోట్లు విడుదలకు సిఎం కెసిఆర్ పరిపాలనా అనుమతులిచ్చారు. ఆదిలాబాద్, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో దాదాపు 50 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఈ బ్యారేజీ నిర్మిస్తున్నారు. 2016 జనవరిలో పెన్‌గంగ ప్రాజెక్ట్ కింద చెనాక -కోర్ట బ్యారేజీ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పనులు ప్రారంభమైన నాటినుంచి రెండేళ్ల కాలపరిమితిలో పూర్తి చేయాలనేది లక్ష్యం. చెనాక- కోర్ట ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతూ నిధులు మంజూరు చేసినందుకు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న సిఎం కెసిఆర్, నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, రైతుల దశాబ్దాల కలను సిఎం కెసిఆర్ 17 నెలల కాలంలోనే సాకారం చేస్తున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని జోగు రామన్న వ్యాఖ్యానించారు.