రాష్ట్రీయం

8 బిల్లులకు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతరం మంగళవారానికి ఏపి శాసనసభ వాయిదా
హైదరాబాద్, డిసెంబర్ 21: ప్రైవేటు యూనివర్శిటీల స్థాపన-నియంత్రణ, వడ్డీవ్యాపార క్రమబద్దీకరణ, నియంత్రణ బిల్లులతో సహా మొత్తం 8 బిల్లులను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారం ఆమోదించింది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ప్రైవేటు విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి పెద్దఎత్తున తీసుకువచ్చి రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా చేయాలనే సంకల్పంతో రూపొందించిన ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును శాసనసభ ఆమోదించింది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టగా దాదాపు 8 మంది సభ్యులు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సభ ఆమోదించింది. దీంతోపాటు రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విజయవాడ కాల్‌మనీ వ్యవహారంపై ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడుతూ వడ్డీ వ్యాపార క్రమబద్దీకరణ, నియంత్రణ బిల్లును కూడా తీసుకువచ్చింది. ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అనంతరం పలువురు సభ్యులు ఈ బిల్లులో ఉన్న లోపాలు తెలియజేస్తూ కొన్ని ముఖ్యమైన సవరణలు చేయాలని కోరుతూ సభ్యులంతా బిల్లుకు మద్దతు పలికారు. తొలు ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ఈ రెండు బిల్లులను శనివారం సమయాభావం వల్ల ప్రవేశపెట్టలేకపోయామని, సభ నిబంభలను అనుసరించి అత్యంత ప్రాధాన్యత ఉన్న బిల్లులుగా గుర్తించి సభలో ప్రవేశపెడుతున్నట్లు శాసనసభాపతి కోడెల శివప్రసాదరావుకు తెలియజేశారు. అనంతరం ఈ రెండు బిల్లును ఆయా మంత్రులు సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులతో పాటు ముందుగా ప్రకటించిన వౌలిక సదుపాయాల అభివృద్ధి వీలుకల్పించే సవరణ బిల్లు, విద్యుత్ శక్తి సుంకం, సముద్రతీర ప్రాంత అభివృద్ధి బోర్డు ఏర్పాటు, స్వదేశంలో తయారయ్యే విదేశీ మద్యం-విదేశీ మద్య వ్యాపార-క్రమబద్దీకరణ, విలువ ఆధారిత పన్ను సవరణ, మహానగర ప్రాంత-పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ బిల్లులను సభ ఆమోదించింది. ఈ ఆరు బిల్లుల్లో మొదటి మూడు బిల్లులను ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు తరఫున కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టారు. మద్యం బిల్లును ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, విలువ ఆధారిత పన్ను బిల్లును ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, పట్టణాభివృద్ధి సంస్థల ప్రాధికార సంస్థ బిల్లును పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. ఈ బిల్లులపై జరిగిన చర్చ అనంతరం స్పీకర్ వాటిని అమోదించినట్లు ప్రకటించారు. అనంతరం శాసనసభను మంగళవారానికి వాయిదా వేశారు.