S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

05/24/2019 - 02:32

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా అఖండ మెజారిటీ సాధించడాన్ని చూస్తే ఇదంతా మోదీ మహిమేనని సర్వత్రా వినపడుతున్న మాట. మోదీకి దీటైన రీతిలో ప్రధాని అభ్యర్థిగా విపక్ష కూటముల నుంచి ఎవరూ.. ఆ స్థాయి సమర్థతతో కనిపించకపోవడం ఈ విజయానికి మరో కారణం.

05/23/2019 - 01:01

విద్యార్థుల జీవితంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఎంతో కీలకమైనవి. ఈ దశలోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బీజం పడుతుంది. అందుకే తల్లిదండ్రులు టెన్త్, ఇంటర్ ముగిసేవరకూ సంవత్సరాలపాటు తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు సర్వస్వం త్యాగం చేస్తారు.

05/19/2019 - 02:26

వానలకు, వనాలకు సంబంధం ఉన్నది. చెట్లు లేకుండా వర్షాలు రావు. అందుకే తెలంగాణ వ్యాప్తంగా అడవులను వృద్ధి చేసి, గ్రీన్‌కవర్ పెంచాలని ప్రభుత్వం ‘హరితహారం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో అడవులు 33 శాతం ఉండేటట్లుగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

05/18/2019 - 01:39

ఒకప్పుడు ఐదో తరగతిలోనో, ఆరో తరగతి లోనో ‘బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవం’ గూర్చి మొదటిసారి తెలుసుకున్నాం. మన గురజాడ, కందుకూరి లాగానే ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్, రాజారామ్మోహన్‌రాయ్‌ల చరిత్ర, సమాజానికి వారందించిన సేవలు తెలిశాయి. మళ్ళీ ఇన్నాళ్లకు ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్‌ను బెంగాల్‌లో రాజకీయ పార్టీలు గుర్తుకు తెచ్చాయి. అదీ మంచి దారిలో కాదు. ఆయన విగ్రహాన్ని పట్టపగలు కూల్చేయడం ద్వారా.

05/12/2019 - 01:34

ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకొనడానికి బదులు వారి ప్రయోజనాలకు భంగం కలిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం అన్యాయం. కార్పొరేట్ కంపెనీలకు ఏటా లక్షల కోట్ల రూపాయల మేరకు రాయితీలు కుమ్మరిస్తున్న కేంద్రం కార్మికుల పెన్షన్ విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదు.

05/11/2019 - 00:12

న్యాయం జరగడమే కాదు, అది జరిగినట్టు నిస్సందేహంగా కనబడాలి. అప్పుడే సామాన్యుడికి సైతం న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం కలుగుతుంది. ఆ విశ్వాసం సడలిపోతే న్యాయవ్యవస్థ మనుగడ ప్రమాదంలో పడుతుంది. మన దేశపు ప్రజాస్వామ్య వ్యవస్థకు శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు మూలస్తంభాలుగా నిలిచాయి. వాటిలో న్యాయవ్యవస్థకి మరింత ప్రాముఖ్యత కలిగిన బాధ్యత.

05/10/2019 - 01:24

ఒకప్పుడు పాలల్లో నీరు కలపటం, శనగనూనెలో పామాయిల్ కలపటం వంటివే నేరం. నేడు మనం తినే ఆహార పదార్థాల్లో కల్తీ చేసిన విష రసాయన పదార్థాలు కలపకపోతే చాలు అని సర్దుకుపోయే స్థితికి సమాజం వచ్చింది. అక్రమార్కులేమో ప్రజలు రోగాల బారిన పడినా, తమకు లాభమొస్తే చాలు అని ఆహార పదార్థాల్లో ముఖ్యంగా వంటనూనెలు, పాలు, పండ్లు వంటి వాటిల్లో విష రసాయన, జంతు అవశేషాలను సైతం కల్తీ చేసే స్థాయికి దిగజారారు.

05/07/2019 - 01:19

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద సముద్ర గర్భంలో కలిసే గోదావరి నది గత రెండు దశాబ్దాలుగా ఉనికిని కోల్పోతోంది. నూట అరవై ఏళ్ల క్రితం సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం వద్ద మూడు అడుగుల నీటి సామర్థ్యంతో డ్యామ్‌ను నిర్మించారు. అయితే, గత కొన్ని దశాబ్దాలుగా నది అంతర్భాగంలో సంరక్షణ లేక మట్టి ఇసుక మేటలను తలపిస్తోంది. ఆనకట్ట నిర్మించకముందు మండు వేసవిలోనూ ధవళేశ్వరం నుండి భద్రాచలం వరకు లాంచీలలో ప్రయాణించేవారు.

05/05/2019 - 01:54

ప్రస్తుత వేసవిలో భానుడు నిప్పులు చెరగడంతో ప్రజలు నానా బాధలు పడుతున్నారు. అప్పుడే 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. ముందుముందు ఎలా ఉంటుందో? ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అత్యవసరమైతే తప్ప బయటకుపోవద్దు. వడదెబ్బబారిన పడకుండా రక్షణ చర్యలను తీసుకోవాలి. మండుటెండలలో కూలిపనులకు విరామం ఇవ్వాలి. ప్రైవేట్ పాఠశాలలు కాన్వాసింగ్ పేరుతో ఉపాధ్యాయులను తిప్పవద్దు.

05/03/2019 - 23:01

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ప్రభువులు. ప్రజల తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులతో చట్టసభలేర్పడినాక ప్రజల తరఫున పనిచేస్తారు. ప్రజల మద్దతు పొందిన పక్షాలు ఐదేళ్లపాటు ప్రభుత్వం ఏర్పరిచి పాలన సాగిస్తాయి- ఆ చట్టసభల పర్యవేక్షణలోనే. ఆ పాలన అమలు చెయ్యడానికి అధికార యంత్రాం గం ఉంటుంది. ఈ వౌలిక సూత్రం గుర్తుంచుకుంటే ఎలాంటి తగాదా లేదు. ‘నేను గొప్ప, నువ్వు తప్పు’ అనే నిరర్ధక చర్చలుండవు.

Pages