S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

12/05/2019 - 00:46

‘ఉల్లిచేసే మేలు తల్లి చేయదన్నా’
నీరుల్లి, ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు,
ఉల్లిగడ్డ, ఎఱుల్లి, సవాళ,
ఆనియన్, వెంగాయమ్, డున్గ్రీ,
ప్యాస్, పియాజ్, కాందా--
ఇన్ని నామాలింకెన్ని నామాలో! అన్నా
ఎంత మురిసిపోతావెంత మురిసిపోతావ్!

12/04/2019 - 00:05

మృగాలుగా మారిన నలుగురు కిరాతకుల చేతిలో ఓ పశువైద్యురాలు హైదరాబాద్ శివార్లలో దారుణంగా అత్యాచారానికి గురై హత్యగావింపబడటం మానవత్వం వున్న ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలిచివేసే విషయం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో జరిగిన ఈ దారుణ, పెను విషాదకర సంఘటన తెలుగు రాష్ట్రాల ప్రజానీకం యావత్తును తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

12/03/2019 - 00:43

విశ్వనగరం.. భాగ్యనగరం.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరం హైదరాబాద్ అని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్న నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఓ వైద్యురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం, సజీవ దహనం ఉదంతం యావత్ దేశాన్ని కలిచి వేసింది. 2012లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ ఘోరం తరహాలో ఆమధ్య జరిగిన దారుణం పట్ల ప్రజానీకం దిగ్భ్రాంతికి గురి అయ్యింది.

12/01/2019 - 04:42

మూసీ నది కాలుష్యంపై నమోదైన ప్రజాప్రయోజనం వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టు వెంటనే స్పందించి, తక్షణం నదీ కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం ముదావహం. 40 ఏళ్ల క్రితం స్వచ్ఛమైన జలాలతో తెలంగాణలో పది లక్షల జనాభాకు ప్రాణాధారంగా నిలిచిన మూసీ నది నేడు మురుగునీటి కంటే అధ్వానంగా మారడం అత్యంత దురదృష్టకరం. మూసీ మాత్రమే కాకుండా దేశంలో ప్రధాన నదులన్నింటిదీ ఇదే వ్యథ.

11/28/2019 - 01:53

తిలకధారణ
రామభజన
జెండా వందనం
యోగాభ్యాసం
వీటికే కాదు పరిమితం
మన సంస్కృతి, సంప్రదాయం

పితృవాక్య పరిపాలన కోసమని
పట్ట్భాషేకాన్ని కాదని
నార వస్త్రాలు ధరించి కానలకేగడం
అరణ్యవాసాన్నీ ఆస్వాదించడం
ఇదీ మన సంస్కృతి, సంప్రదాయం

11/26/2019 - 23:30

కోల్‌కతలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండవ క్రికెట్ టెస్టులో టీమ్ ఇం డియా ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో విజయభేరి మ్రోగించి రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకొని ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ పట్టికలో 360 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని చేరుకోవడం గొప్ప విశేషం. ఈ టెస్ట్‌సిరీస్ విజయంతో కోహ్లీ సేన తమ సొంత గడ్డపై 12వ సిరీస్ విజయం సాధించి ఔరా అనిపించింది.

11/24/2019 - 01:58

మహారాష్టలో సుమారు గత నెల రోజులుగా సాగుతున్న పదవీ రాజకీయాలు దేశ ప్రజలకు జుగుప్సను కలిగిస్తున్నాయి. శాసనసభ ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న భారతీయ జనతాపార్టీ, శివసేన కూటమికి వోటర్లు మెజారిటీ ఇచ్చినా ప్రభుత్వం ఏర్పాటు కావడంలో అంతులేని జాప్యం జరిగింది. ముఖ్యమంత్రి పీఠం తమకంటే తమకని కొట్లాడుకున్న భాజపా, శివసేన పార్టీలు ఓటర్ల తీర్పును గంగలో కలిపాయి.

11/15/2019 - 01:28

అయోధ్యలోని మందిర్-మసీదు వివాదంపై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు దశాబ్దాల సమస్యకు శాశ్వత ముగింపు పలికే విధంగానే ఉంది. అయోధ్యలో శ్రీరాముడి పుట్టుకపై, బాబర్ కట్టడంపై వాదనలు ఎలా ఉన్నా, అయోధ్య హిందువులకు పవిత్రమైనదిగా అందరూ అంగీకరిస్తారు. శ్రీరాముడిని నమ్మేవారైనా, నమ్మనివారైనా తమ బిడ్డలు అలా ఆదర్శంగా ఉండాలనుకుంటారు. ఇక, పురావస్తు శాఖ పురాతన కట్టడంపై మసీదు నిర్మించినట్లు తన అధ్యయనంలో తేల్చింది.

11/10/2019 - 00:23

అయోధ్యలోని రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై దేశ ప్రజలంతా దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కీలక తీర్పును సర్వోన్నత న్యాయస్థానం ఏకగ్రీవంగా వెలువరించడం శుభపరిణామంగా భావించాలి. సుప్రీం తీర్పును అన్ని వర్గాల వారూ గౌరవించాలి. మతం పేరిట విద్వేషాలను రెచ్చగొట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రజలందరూ శాంతియుతంగా సంయమనంతో ఉండాల్సిన తరుణం ఇది.

11/08/2019 - 01:52

మహిళలు నేడు అన్ని రంగాలలో చొచ్చుకొని వెళ్తున్నారు. మహిళలకు సాధికారత అంటూ ఒకవైపుపాలకులు, పౌర సమాజం మహిళల గురించి ప్రశంసిస్తూనే.. మరొకవైపు వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా భావిస్తున్నారు. మహిళలపై కొందరు అమానుషంగా దురాగతాలకు పాల్పడడం చూస్తుంటే నేటి సమాజం ఎటువైపు పోతున్నదో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

Pages