S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/14/2016 - 03:24

రాజమహేంద్రవరం, నవంబర్ 13: ప్రత్యేక హోదా కోసం సిపిఐ ముందు నుంచీ పోరాటం చేస్తోందని, పవన్‌కళ్యాణ్‌తో పాటు ఎవరు ముందుకొచ్చినా కలిసి పోరాటాన్ని సాగిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

11/14/2016 - 03:23

అనంతపురం అర్బన్, నవంబర్ 13 : పెద్దనోట్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ వెంటనే అవసరం మేరకు కొత్త నోట్లను బ్యాంకులకు చేరవేసి, ప్రజల కష్టాలు తీర్చాలని పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా బ్యాంకుల ఎదుట ధర్నాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

11/14/2016 - 03:21

కడప, నవంబర్ 13 : దుబాయ్‌కి చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అలీవుద్దీన్‌తో పాటు అతడి ఐదుగురు ప్రధాన అనుచరులను ఆదివారం కడప జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ తెలిపారు. కడప నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఎస్పీ విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

11/14/2016 - 03:15

కొత్తూరు, నవంబర్ 13: హిందూ ధర్మంతో పాటు హిందూ దేవాలయాల పరిరక్షణ, గోవధ నిషేధం వంటి అనేక హిందూ ధర్మాల పరిరక్షణపై విస్తృతంగా ప్రచారం అవసరమని ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు, ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి పేర్కొన్నారు. అఖిలాంధ్ర హిందూ సమ్మేళనంపై ప్రచారం నిమిత్తం శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరులో ఆదివారం అఖిలాంధ్ర హిందూ ధర్మ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

11/14/2016 - 03:13

ఒంగోలు, నవంబర్ 13: రాష్ట్రంలోని మహిళల రక్షణ కోసం త్వరలో అభయ యాప్‌ను అన్ని జిల్లాల్లో ప్రవేశపెడుతున్నట్లు డిజిపి నండూరి సాంబశివరావు వెల్లడించారు. ఆదివారం ఒంగోలులోని ఎస్‌పి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలుత విశాఖపట్నంలో ఈ యాప్‌ను వినియోగించామని, దీనిని త్వరలో రాష్టవ్య్రాప్తంగా విస్తరింప చేయనున్నట్లు తెలిపారు.

11/14/2016 - 03:13

తోటపల్లిగూడూరు, నవంబర్ 13: విహార యాత్ర విషాదం మిగిల్చింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్‌లో ఈతకెళ్లి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.

11/14/2016 - 03:11

విశాఖపట్నం, నవంబర్ 13: నైరుతి బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తాను ఆనుకుని అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొన్నారు. రాత్రి ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పేమీ ఉండదన స్పష్టం చేశారు.

11/14/2016 - 02:18

అమరావతి, నవంబర్ 13: రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 80 శాతం ఓటర్లకు చేరవయ్యే లక్ష్యానికి తెలుగుదేశం పార్టీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజలకు చేర్చి, చేసింది చెప్పడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలన్న ముందస్తు వ్యూహంతో చంద్రబాబునాయుడు ఈ ప్రణాళిక రచించారు. 80శాతం ఓటర్లకు చేరవయ్యే బాధ్యతను నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇంచార్జులకు అప్పగించారు.

11/14/2016 - 02:15

ప్రత్తిపాడు, నవంబర్ 13: కాపులకు రిజర్వేషన్ల కోసం శాంతియుతంగా తాను నిర్వహించనున్న పాదయాత్రను ఎట్టి పరిస్థితిలోనూ ఆపేది లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ప్రభుత్వానికి అనుమానం ఉంటే అనుమానం ఉంటే తనకు యాత్రలో పాల్గొనే సహచరులకు పోలీసుల చేత బేడీలు వేయించైనా, యాత్రకు సహకరించాలని ముద్రగడ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరారు.

11/14/2016 - 02:13

హైదరాబాద్, నవంబర్ 13: కేంద్ర ప్రభుత్వం శాస్ర్తియ ప్రణాళిక లేకుండా పెద్ద నోట్లు రద్దు చేయడంతో దేశ ప్రజలు అల్లాడుతున్నారని, పెద్ద నోట్ల రద్దు గురించి ఏపి సిఎం చంద్రబాబుకు ముందే తెలుసని, నాలుగు నెలల్లో లక్ష కోట్ల నల్లధనాన్ని తెలుపు చేసుకున్నారని వైఎస్సార్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.

Pages