S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/25/2016 - 05:22

హైదరాబాద్, మే 24 : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేటినుంచి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ‘రోహిణీ కార్తె’ బుధవారం ప్రారంభమై జూన్ 8 వరకు ఉంటుంది. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రత సాధారణంగా రోహిణిలోనే నమోదవుతోంది. గత పది పదిహేను రోజుల నుంచి తుపానుతో పాటు వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి, గత రెండు రోజుల నుండి మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి.

05/25/2016 - 05:15

హైదరాబాద్, మే 24: ఆంధ్ర, తెలంగాణ మధ్య వివాదస్పదంగా మారిన రాజోళిబండ ప్రాజెక్టు ఎత్తు పెంచే అంశం కొత్త మలుపుతిరిగింది. ఉభయ రాష్ట్రాలు సయోధ్య కుదుర్చుకుని ఒక రాజీ ఫార్ములాను సూచించాలని.. అప్పుడే ఆర్డీఎస్ ఎత్తు పెంపుపై ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని ఏపీ ఇంజనీర్ల బృందానికి కర్నాటక తేల్చి చెప్పినట్లు సమాచారం.

05/25/2016 - 05:13

హైదరాబాద్, మే 24:రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. కులాలు, ప్రాంతాల డిమాండ్లతో టిడిపి అధినేత, ఏపి సీఎం చంద్రబాబునాయుడుపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఏపి నుంచి ఖాళీ అయ్యే నాలుగు సీట్ల భర్తీ ప్రక్రియలో మూడు స్థానాలు టిడిపి, ఒకటి వైఎస్సార్‌సీపీకి సులభంగా దక్కే అవకాశాలున్నాయి.

05/24/2016 - 03:28

మహబూబ్‌నగర్, మే 23 : దశాబ్దాలపాటు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల రైతులు, నేతల మధ్య వివాదాల సుడిగుండంగా మారిన రాజోలిబండ మళ్లింపు పథకం మళ్లీ రాజుకుంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు హరీష్‌రావు, దేవినేని ఉమ మధ్య ఆర్డీఎస్ పుడికతీత పనులతో పాటు ఆనకట్ట పెంపు విషయంపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడంతోనే రగడ మొదలైంది.

05/24/2016 - 03:26

విజయవాడ, మే 23: అవయవదానం పట్ల సామాన్య ప్రజల్లో సైతం చైతన్యం పెరుగుతోంది. అయితే పేదలు ఇస్తున్న అవయవాలు కోట్లకు పడగలెత్తిన పెద్దల పునర్జన్మకే తరలిపోతున్నాయి. ప్రభుత్వ వైద్యశాలల్లో అవయవాల మార్పిడి విభాగాలు లేకపోవటంతో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షలకు లక్షల రూపాయలు ఖర్చు చేయగలిగే స్థితిమంతుల అవసరాలు ఆసరా చేసుకొని మహత్తర అవయవదాన మహోద్యమంలో దళారుల పాత్ర పెరుగుతోందా?

05/24/2016 - 03:24

హైదరాబాద్, మే 23: ఖరీఫ్ సీజన్‌కు అంతా సన్నద్ధం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యవసాయ శాఖ అధికారులు, కలెక్టర్లను ఆదేశించారు. సీఎం అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సోమవారం జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. వాతావరణం చల్లబడినా, ఎండాకాలం ఇంకా అయిపోలేదని ప్రజలకు మంచినీరు సరఫరా చేయడంతో పాటు సహాయ కార్యక్రమాలు అన్నీ కొనసాగించాలని ముఖ్యమంత్రి తెలిపారు.

05/24/2016 - 03:21

హైదరాబాద్, మే 23: ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నవారి కోసం నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జూన్ 8న చేపప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్టు బత్తితి హరినాథ్ గౌడ్ తెలిపారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1945వ సంవత్సరం నుంచి తమ పూర్వీకులు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.

05/24/2016 - 03:16

హైదరాబాద్, మే 23: భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వెంట చైనా పర్యటనకు వెళ్లే బృందంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన స్కూల్ ఆఫ్ మేనేజిమెంట్ స్టడీస్ మాజీ డీన్ ప్రొఫెసర్ వెంకటరమణ ఎంపికయ్యారు. చైనా చెంగ్జులో రాష్టప్రతి పర్యటనలో భాగంగా భారత్ -చైనా బిజినెస్ ఫోరం బృందం అనేక చర్చలు జరపనుంది.

05/24/2016 - 03:14

హైదరాబాద్ మే 23: కాంగ్రెస్ రహిత భారతదేశ కలను సాకారం చేసుకునే లక్ష్యంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ప్రారంభించింది. రెండేళ్ల మోదీ పాలనలో వివిధ రాష్ట్రాలకు చేసిన సాయంతోపాటు, వివిధ వర్గాల సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో ప్రచారం చేసేందుకు ఏర్పాటుచేసిన ‘వికాస్ పర్వ్’ కార్యక్రమం విజయవంతం కోసం కసరత్తు మొదలుపెట్టింది.

05/24/2016 - 03:13

విశాఖపట్నం, మే 23: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్రం మీదుగా పొడి, వేడి గాలులు వీస్తుండటంతో చాలా చోట్ల సాధారణం కంటే 4 నుంచి 7 డిగ్రీలు అధికంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రోను తుపాను కారణంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికి, తుపాను తరువాత ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి.

Pages