నాన్నకు ప్రేమతో.. సంక్రాంతి కానుక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ రూపొందించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు. సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం టెక్నికల్‌గా హైస్టాండర్డ్స్‌లో ఉంటుందని, షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నామని, సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నామని తెలిపారు. రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తా.రమేష్, గిరి, నవీన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: విజయ్‌చక్రవర్తి, ఫైట్స్: పీటర్హెయిన్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, పాటలు: చంద్రబోస్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.