బిజినెస్

ఎల్‌ఇడి వినియోగంలో ఆంధ్ర ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: ఎల్‌ఇడి బల్బుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని, ఈ బల్బుల వల్ల విద్యుత్ ఆదా 50 శాతం వరకు ఉందని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఏపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్ తెలిపారు.
వీధులను మాత్రమే కాకుండా ఇండ్లను సైతం ఎల్‌ఇడి బల్బులతో నింపేయాలనే యోచనలో ఉన్నట్లు వారు చెప్పారు. ఇంధన పొదుపు ఫ్యాన్లను విక్రయిస్తున్నామని, ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాలో అమలు చేస్తున్నామన్నారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని పేర్కొన్నారు. పది రూపాయల చొప్పున ఒక్కో ఇంటికి రెండేసి ఎల్‌ఇడి బల్బులను అందచేసే పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం.. అతి తక్కువ కాలంలో 1.75 కోట్ల ఇండ్లకు బల్బులను అందించినట్లు తెలియ జేశారు.
కాగా, రాష్ట్రంలో 500 విద్యుత్ సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌కో డిస్కాం కార్యాలయాల ద్వారా 15 వాట్ల బల్బులను, ఎనర్జీ సేవింగ్ ఫ్యాన్లను విక్రయించనున్నామన్నారు. ఇంధన పొదుపు ఫ్యాన్లపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా ప్రచారం చేపట్టనున్నట్లు వారు తెలిపారు.