బిజినెస్

మోటారు వాహన చట్ట సవరణను వ్యతిరేకిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,అక్టోబరు 20: మోటారు వాహన చట్టానికి ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని సిపిఎం సీనియర్ నేత ప్రకాశ్ కారత్ తెలిపారు. ఈ చట్ట సవరణ బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చినప్పుడు సిపిఎం, వామపక్షాలు వ్యతిరేకిస్తాయని ఆయన స్పష్టం చేశారు. దేశంలో రోడ్డు రవాణా, భద్రతపై విస్తృత చర్చ జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రోడ్డు రవాణాపై ఢిల్లీలో రెండు రోజులుగా జరగుతున్న జాతీయ సదస్సులో ప్రకాశ్ కారత్ మాట్లడుతూ, రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం ప్రపంచలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో రోడ్డు రవాణ రంగం ప్రముఖ పాత్ర పోషిస్తోందని, అయనప్పటికీ ఈ రంగానికి సంబంధించిన పలు సమస్యలను కేంద్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ప్రజల సామాజిక భద్రతకు భరోసా కల్పించే విధంగా లేవని ఆయన ధ్వజమెత్తారు. సిపిఐ నేత, రాజ్యసభ సభ్యుడు డి.రాజా ప్రసంగిస్తూ, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం మోటారు వాహన చట్టానికి అశాస్ర్తియంగా సవరణలు చేపట్టిందని, ఈ విషయంలో ఎవరి మాట వినకుండా తన సొంత ఎజెండాను అమలు చేస్తొందని విమర్శించారు.

చిత్రం..జాతీయ రోడ్డు రవాణా సదస్సులో పాల్గొన్న ప్రకాష్ కారత్, డి.రాజా తదితరులు