బిజినెస్

చంద్రబాబుతో టోనీ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధి బృందం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 19: ఆంధ్రప్రదేశ్‌లో కర్మాగారాన్ని నెలకొల్పటానికి ఎలక్ట్రానిక్స్ రంగ దిగ్గజం టిసిఎల్ కంపెనీకి అనుబంధంగా ఉన్న టోనీ ఎలక్ట్రానిక్స్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. టిసిఎల్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్, టోనీ ఎలక్ట్రానిక్స్ హోల్డింగ్స్ సిఇఒ గారీ యు నేతృత్వంలో చైనా నుంచి వచ్చిన ప్రతినిధి బృందం విజయవాడ సిఎంఒలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో బుధవారం భేటీ అయ్యింది. తమ రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును అతి త్వరలో ప్రారంభించనున్నట్లు టిసిఎల్ కంపెనీ ప్రతినిధులతో ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కానున్నాయని వివరించారు. విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ (విసిఐసి)కి 625 మిలియన్ డాలర్ల రుణం ఇవ్వటానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు అంగీకరించిందన్నారు. 2019వ సంవత్సరానికి మొదటి దశ ప్రాజెక్టు పూర్తవుతుందని, టెక్నాలజీలో తాము పటిష్ఠంగా ఉన్నామన్నారు. కాగా, టిసిఎల్‌కు ప్రపంచ వ్యాప్తంగా 21 ఉత్పత్తి కేంద్రాలు, 80 విక్రయ కార్యాలయాలు, 23 అభివృద్ధి, పరిశోధనా సంస్థలున్నాయి. దేశ విదేశీ కంపెనీలలో 75 వేల మంది ఉద్యోగులున్నారు.

టోనీ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులతో చంద్రబాబు