బిజినెస్

అన్నీ మంచి శకునములే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 18: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. మదుపరుల కొనుగోళ్ల జోరుతో సూచీలు పరుగులు పెట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్.. దాదాపు ఐదు నెలల్లో ఏ రోజూ లేనంతగా గరిష్ఠ స్థాయి లాభాన్ని అందుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం మళ్లీ 8,600 మార్కును అధిగమించింది. నిఫ్టీ లాభమూ ఐదు నెలల గరిష్ఠ స్థాయిలో నమోదైంది. కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)పై సమావేశమైన జిఎస్‌టి మండలి నుంచి సానుకూల సంకేతాలు వస్తాయన్న ఆశాభావం మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న జిఎస్‌టి పన్నులో రేట్లు, స్లాబులు, పరోక్ష పన్నుల వాటాను అందరికీ ఆమోదయోగ్యంగా మండలి నిర్ణయిస్తుందన్న అంచనాలు దేశ, విదేశీ మదుపరులను పెట్టుబడుల దిశగా నడిపించాయి.
ఇకపోతే ద్రవ్యోల్బణం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అంచనాల దిగువనే ఉంటుందని, ఇది వడ్డీరేట్ల తగ్గింపునకు దోహదపడుతుందన్న భావనలు కూడా మంగళవారం ట్రేడింగ్‌కు కలిసొచ్చాయి. అలాగే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పెరగడమూ మదుపరులకు ఉత్సాహాన్నిచ్చింది. సోమవారం ముగింపుతో చూస్తే మంగళవారం రూపాయి విలువ 15 పైసలు పెరిగి 66.73 రూపాయలకు చేరుకుంది. దీంతోపాటు అమెరికా తయారీరంగ సూచీ పతనం కావడం కూడా భారతీయ స్టాక్ మార్కెట్ల భారీ లాభాలకు కారణమైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడిందని భావిస్తున్న ఆ దేశ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్.. సుదీర్ఘకాలం నుంచి యథాతథంగా ఉంచిన వడ్డీరేట్లను పెంచేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్య ఉత్పాదక రంగం ఇంకా ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని తాజా గణాంకాలు తేటతెల్లం చేయడంతో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు ఆలస్యం అవుతుందని మదుపరులు విశ్వసించారు. దీంతో విదేశీ మదుపరులు భారత మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. ఫలితంగానే సెనె్సక్స్ 520.91 పాయింట్లు పుంజుకుని 28 వేల మార్కును అధిగమించి 28,050.88 వద్దకు చేరింది. ఒకానొక దశలో 28,064.39 పాయింట్ల గరిష్ఠ స్థాయినీ తాకింది.
ఈ ఏడాది మే 25న సెనె్సక్స్ 575.70 పాయింట్ల లాభాన్ని పొందింది. మళ్లీ ఆ తర్వాత మంగళవారం ఒక్కరోజే 520.91 పాయింట్ల లాభాన్ని అందుకుంది. ఇక నిఫ్టీ కూడా 157.50 పాయింట్లు ఎగిసి 8,600 స్థాయిని దాటి 8,677.90 వద్ద నిలిచింది. సోమవారం సెనె్సక్స్ 143.63 పాయింట్లు, నిఫ్టీ 63 పాయింట్ల చొప్పున నష్టపోయినది తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్)గాను కార్పొరేట్ సంస్థలు ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలకు తగ్గట్లుగా లేకపోవడం కూడా సోమవారం నష్టాలకు ఓ కారణమేనని మార్కెట్ వర్గాలు విశే్లషిస్తున్నాయి. అయితే మంగళవారం ఈ ట్రెండ్ ఒక్కసారిగా మారిపోయి సూచీలు భారీ లాభాలను అందుకోవడంపట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, బ్యాంకింగ్ రంగ షేర్లు అత్యధికంగా మదుపరులను ఆకట్టుకుని 2.37 శాతం మేర లాభాలను పొందాయి. ప్రైవేట్‌రంగ దిగ్గజ బ్యాంకులైన ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్ల విలువ భారీగా పెరిగింది. ఐసిఐసిఐ షేర్ విలువ 4.58 శాతం పెరిగితే, యాక్సిస్ షేర్ విలువ 2.59 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్ విలువ 1.58 శాతం ఎగిశాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ షేర్ విలువ కూడా 1.50 శాతం ఎగిసింది. క్యాపిటల్ గూడ్స్ 2.07 శాతం, ఐటి 1.84 శాతం, మెటల్ 1.82 శాతం, టెక్నాలజీ షేర్ల విలువ 1.68 శాతం చొప్పున పుంజుకుంది. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ సూచీ 1.89 శాతం, స్మాల్-క్యాప్ సూచీ 1.30 శాతం మేర పెరిగాయి. ఇక మంగళవారం ట్రేడింగ్‌లో సెనె్సక్స్-30లో 28 సంస్థలు లాభపడగా, ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ, ఉత్పాదక దిగ్గజం ఒఎన్‌జిసి, ఏషియన్ పెయింట్స్ షేర్లు మాత్రం నష్టపోయాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు కూడా భారతీయ స్టాక్ మార్కెట్ల లాభాలకు కారణమయ్యాయి. ఆసియా మార్కెట్లలో కీలకమైన హాంకాంగ్, చైనా, జపాన్ సూచీలు 1.55 శాతం నుంచి 0.38 శాతం వరకు పెరిగాయి. ఐరోపా మార్కెట్లలోనూ ప్రధానమైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు 1.21 శాతం వరకు బలపడ్డాయి.

చిత్రం.. మంగళవారం ముంబయలోని బిఎస్‌ఇ వద్ద ప్రారంభ గంట మోగిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ
సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్