ముక్కోణపు ప్రేమకథలో పూనమ్‌పాండే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పూనమ్‌పాండే ప్రధాన పాత్రలో వి.బి.ఆర్. క్రియేషన్స్, సూరజ్ ప్రొడక్షన్స్ పతాకంపై భవానీ మస్తాన్ దర్శకత్వంలో ఫకృద్దీన్‌ఖాన్, విజయ్‌భాస్కర్‌రెడ్డి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ మంగళవారం పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూనమ్‌పాండే గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, రెండో షెడ్యూల్ ప్రారంభిస్తున్నామని అన్నారు. ఒక ప్రత్యేక పాత్రలో సంపూర్ణేష్‌బాబు, ఆశిష్‌విద్యార్థి నటిస్తున్నారని, ఈనెలాఖరున ముంబయిలో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తామని తెలిపారు. హిందీ తెలుగు భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రం తమకు మంచి విజయాన్ని అందిస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. తా.రమేష్, జబర్దస్త్ బృందం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆనెం వెంకటరావు, నిర్మాతలు: ఫకృద్దీన్‌ఖాన్, విజయ్‌భాస్కర్‌రెడ్డి పామూరు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భవానీ మస్తాన్.