బిజినెస్

రాస్‌నెఫ్ట్ చేతికి ఎస్సార్ ఆయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజి, అక్టోబర్ 15: రష్యాకు చెందిన ప్రభుత్వరంగ చమురు సంస్థ రాస్‌నెఫ్ట్ నేతృత్వంలోని కూటమి.. శనివారం ఎస్సార్ ఆయిల్‌ను హస్తగతం చేసుకుంది. భారతీయ రెండో అతిపెద్ద ప్రైవేట్‌రంగ చమురు సంస్థ అయిన ఎస్సార్ ఆయిల్‌ను రాస్‌నెఫ్ట్ కూటమి దాదాపు 13 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. భారత్‌లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డిఐ) ఈ డీల్‌నే అతిపెద్దది కావడం గమనార్హం. డాలర్‌తో పోల్చితే భారత కరెన్సీ రూపాయికి ఉన్న ప్రస్తుత విలువ ప్రకారం ఈ డీల్ విలువ సుమారు 90,000 కోట్ల రూపాయలు మరి.
ఇక పూర్తిగా నగదు లావాదేవీల్లో జరిగిన ఈ డీల్‌లో ఎస్సార్ ఆయిల్‌లోని 49 శాతం వాటాను రాస్‌నెఫ్ట్ అందుకుంది. మరో 49 శాతం వాటాను ప్రపంచంలోని అతిపెద్ద కమాడిటీ ట్రేడింగ్ సంస్థల్లో ఒకటైన నెదర్లాండ్స్‌కు చెందిన ట్రఫిగుర గ్రూప్‌తోపాటు రష్యా ఇనె్వస్ట్‌మెంట్ ఫండ్ యునైటెడ్ క్యాపిటల్ పార్ట్‌నర్స్ పొందుతున్నాయి. ఎస్సార్ డీలిస్టింగ్ తర్వాత మిగతా 2 శాతం వాటాను మైనారిటీ భాగస్వాములు అందుకుంటారు. ఎస్సార్ ఆయిల్‌కు చెల్లిస్తున్న 13 బిలియన్ డాలర్లలో 4.5 బిలియన్ డాలర్లు ఎస్సార్ ఆయిల్ రుణమైతే, దాదాపు మరో 2 బిలియన్ డాలర్ల రుణం.. పోర్ట్ కంపెనీ, పవర్ ప్లాంట్‌లకు చెందినవి ఉన్నాయి. ఇంతకుముందు జరిపిన చమురు కొనుగోళ్లకు సంబంధించి ఇరాన్‌కు చెల్లించాల్సిన సుమారు 3 బిలియన్ డాలర్ల బకాయిలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ డీల్‌లోనే గుజరాత్‌లోని ఎస్సార్ ఆయిల్‌కు చెందిన 20 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన చమురు శుద్ధి కర్మాగారం ఉందని ఎస్సార్ గ్రూప్ డైరెక్టర్ ప్రశాంత్ రుయా తెలిపారు. వచ్చే ఏడాది ప్రథమ త్రైమాసికంలో ఈ డీల్ ముగియవచ్చన్నారు.