బిజినెస్

దూసుకెళ్తున్న టిసిఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 13: దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) మార్కెట్ అంచనాలను మంచి లాభాలను ఆర్జించింది. గురువారం సాయంత్రం టిసిఎస్ సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో ఆ సంస్థ నికర లాభం అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 8.4 శాతం పెరిగి రూ.6,586 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ. 6,073 కోట్లు ఉండగా ఇప్పుడది రూ.6,586 కోట్లకు పెరిగింది. కాగా, అదే సమయంలో గత ఏడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే నికర రెవిన్యూ సైతం 8 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర రాబడి రూ. 27,165 కోట్లు ఉండగా, ఇప్పుడది రూ. 29,284 కోట్లకు పెరిగింది. ఈ లెక్కలన్నీ కూడా భారతీయ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం రూపొందించినవి.
కాగా, రెండో త్రైమాసికం కంపెనీకి ఒక అసాధారణమైనదని టిసిఎస్ సిఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ చంద్రశేఖరన్ అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చితి వాతావరణం కారణంగా కస్టమర్లు ఐటిపై ఖర్చు విషయంలో జాగ్రత్త వహించారని, లాటిన్ అమెరికా, భారత్‌లాంటి మార్కెట్లలో రెవిన్యూ వృద్ధి స్వల్పంగానే ఉందని ఆయన చెప్పారు. అయితే లాభాలపరంగా చూసినట్లయితే ఇది మంది త్రైమాసికమేనని ఆయన చెప్పారు. డాలర్ల రెవిన్యూపరంగా చూసినట్లయితే మార్కెట్ అంచనాలను అందుకోలేక పోయామని, త్రైమాసికాల పరంగా చూసినట్లయితే ఈ రెవిన్యూలు 0.3 శాతం మాత్రమే పెరిగి 4374 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయని ఆయన చెప్పారు. అయితే సాంకేతికపరంగా కంపెనీ గణనీయంగా మెరుగుపడినందున ఈ పరిస్థితి తాత్కాలికమేనని కంపెనీలోని ఉద్యోగులందరూ భావిస్తున్నారని చంద్రశేఖరన్ చెప్పారు. టిసిఎస్ నికర లాభాలు రెండో త్రైమాసికంలో మార్కెట్ ఆశించిన మేరకు ఉండకపోవచ్చని మార్కెట్‌తో పాటుగా టిసిఎస్ వర్గాలు శాతం భావించిన నేపథ్యంలో కంపెనీ అంచనాలకు మించి ఫలితాలు సాధించడం గమనార్హం.
కాగా, ఈ సందర్భంగా టిసిఎస్ ప్రతి షేరుకు రూ 6.5 మొత్తం డివిడెండ్‌ను ప్రకటించింది. కాగా, ఈ మూడు నెలల కాలంలో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 22,665 పెరగ్గా, నికర ఉద్యోగులు 9,440 మంది పెరిగారు. దీంతో సెప్టెంబర్ 30 నాటికి కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.71 లక్షలకు చేరుకుంది.

చిత్రం.. రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తున్న
టిసిఎస్ సిఇఓ ఎన్.చంద్రశేఖరన్