బిజినెస్

టాటా మోటార్స్ విదేశీ అమ్మకాల్లో వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్ విదేశీ అమ్మకాలు గత నెల సెప్టెంబర్‌లో 5.35 శాతం పెరిగాయి. 1,02,289 యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు సోమవారం టాటా మోటార్స్ తెలిపింది. ఇందులో టాటా మోటార్స్ లగ్జరీ కార్లు జాగ్వార్ లాండ్ రోడర్ (జెఎల్‌ఆర్) విక్రయాలు కూడా ఉన్నాయి. నిరుడు సెప్టెంబర్‌లో 97,102 యూనిట్ల అమ్మకాలు జరిగాయని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు టాటా మోటార్స్ తెలియజేసింది. ఇక ఈసారి ప్యాసింజర్ వాహన అమ్మకాలు 67,895 యూనిట్లుగా, వాణిజ్య వాహన విక్రయాలు 34,394 యూనిట్లుగా ఉన్నాయి. వీటిలో జెఎల్‌ఆర్ విక్రయాలు 52,914 యూనిట్లు.

విపక్షాలవి అవగాహనలేని
మాటలు: తలసాని

హైదరాబాద్, అక్టోబర్ 10: కొత్త జిల్లాల ఏర్పాటుపై విపక్షాలు తలతిక్క మాటలు మాట్లాడుతున్నాయని తెలంగాణ పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. పిసిసి అధ్యక్షుని స్థాయిలో ఉండి జిల్లాల ఏర్పాటుపై ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశం నిర్వహించి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారని, సమావేశానికి వచ్చిన ఇద్దరు కాంగ్రెస్ ప్రతినిధులు ఏం చెప్పారో పిసిసి అధ్యక్షునికి తెలుసా? అని ప్రశ్నించారు. జిల్లాల ఏర్పాటుపై కాంగ్రెస్ ఏనాడూ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాజెక్టులపై శాసన సభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తే సభలో ఉండకుండా పారిపోయారని, ప్రాజెక్టుల గురించి మేం ప్రిపేర్ కాలేదు అని చెప్పిన ఘనత పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. కాగా, ఇటీవల కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని,కల్తీ విత్తనాలు సరఫరా చేసేవారిపై పిడి యాక్ట్ కింద కేసులు పెట్టనున్నట్టు చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం సాగిందని, ఈ మూడింటిని ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారన్నారు.

ఉద్యోగుల గ్రాట్యుటీపై
ఇసిఐఎల్ పిటిషన్ స్వీకారం

హైదరాబాద్, అక్టోబర్ 10: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఇసిఐఎల్)లో పనిచేస్తూ 2010 మే 24వ తేదీకి ముందు రిటైరైన ఉద్యోగులకు కొత్తగా అమల్లోకి వచ్చిన గ్రాట్యుటీ నిబంధలను వర్తింప జేయాలని కోరడం సరికాదంటూ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు విచారణకు స్వీకరించింది. సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై సోమవారం జస్టిస్ ఎ రామలింగేశ్వరరావు విచారణ చేపట్టారు. 2010 మే 24 కంటే ముందు రిటైరైన వారికి అప్పటి నియమనిబంధనల ప్రకారం 3.50 లక్షల రూపాయలను గరిష్ఠ గ్రాట్యుటీగా చెల్లించడం జరిగిందని, ఆ తర్వాత గరిష్ఠ గ్రాట్యుటీ రూ. 10 లక్షలకు పెంచారని, అయితే పెంచిన గ్రాట్యుటీ తమకూ చెల్లించాలని అంతకుముందు రిటైరైన ఉద్యోగులు కోరడం సరికాదని సంస్థ వాదించింది. గ్రాట్యుటీ యాక్ట్ 1972 అమలు చేయాలని కంట్రోల్ అథారిటీని కోరడాన్ని న్యాయస్థానం దృష్టికి సంస్థ తెచ్చింది.
వక్ఫ్ ఆస్తుల నోటిఫికేషన్‌ను నిలిపేసిన హైకోర్టు
ఇదిలావుంటే, మెదక్ జిల్లా సిద్ధిపేట, నర్సాపూర్ తాలూకాల్లోని 500 ఎకరాల భూమిని వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన గెజిట్‌ను రాష్ట్ర హైకోర్టు సోమవారం నిలిపి వేసింది.