బిజినెస్

ఏకకాలంలో 21 జిల్లాల్లో విద్యా కార్యాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణలో కొత్తగా ఏర్పాటవుతున్న 21 జిలాల్లో దసరా రోజు నుండే విద్యా పాలన ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖలు సకల ఏర్పాట్లు చేశాయి. కొత్తగా కార్యాలయాలను గుర్తించడం, అవసరమైన వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తూ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇటు పాఠశాల విద్యాశాఖ అధీనంలో డిఇఒ కార్యాలయాలు, అటు ఉన్నత విద్యాశాఖ అధీనంలోని ఆర్‌ఐఒ కార్యాలయాలు ఒకే మారు మంగళవారం నాడు ప్రారంభ మవుతాయి. డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, రీజనల్ ఇన్‌స్పెక్టింగ్ ఆఫీసర్ పోస్టుల స్థానే ఇంటర్ విద్యాశాఖ జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి (డిఐఇఒ) పోస్టులను సృష్టించింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త జిల్లాల నుండే విద్యా పాలన ప్రారంభం కావాలని సీనియర్ అధికారులు సైతం ఆదేశించడంతో కొత్త జిల్లాల పరిధిలోకి వచ్చే మండలాల రికార్డులను జిరాక్స్‌లు తీసి కొత్త జిల్లాల పరిధికి పంపిస్తున్నారు. కొత్త జిల్లాల్లో ఇప్పటికిప్పుడు కార్యాలయాలు దొరక్కపోవడంతో అందుబాటులో ఉన్న ప్రభుత్వ హైస్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఈ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. బిసి, ఎస్సీ, ఎస్టీలకు చెందిన హాస్టళ్ల సంక్షేమ అధికారి కార్యాలయాలు, పర్యవేక్షణాధికారుల కార్యాలయాలు, డిఇఒ, డిప్యూటీ డిఇఒ కార్యాలయాలు సైతం వివిధ రెసిడెన్షియల్ స్కూళ్లలో కాలేజీల్లో ప్రారంభమవుతున్నాయి. సకల సదుపాయాలు ఇప్పటికిప్పుడు కల్పించలేకపోయినా, రానున్న వారం పది రోజుల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఒక సీనియర్ అధికారి చెప్పారు. కొత్తగా ఏర్పడే జిల్లాల్లో జిల్లా విద్యాశాఖాధికారులుగా పనిచేసేందుకు డిప్యూటీ డిఇఒలు, ఎడిలు, డైట్ లెక్చరర్లకు పదోన్నతులు కల్పించారు. తాత్కాలిక విద్యాశాఖాధికారులుగా వీరు వ్యవహరిస్తారు. మొత్తం 21 మందిని ఇప్పటికే ఎంపిక చేసిన ప్రభుత్వం ఆ మేరకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలను పంపించింది. కొత్తగా ఏర్పడే 21 జిల్లాల్లో వీరందరికీ వర్కు టు సెర్స్ ఆర్డర్లు జారీ అయ్యాయి. ఈ నెల 10 నుండే వీరు తమ బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. కొత్త జిల్లాల్లో కార్యాలయాలు ప్రారంభించి 11వ తేదీ నుండి పాలన మొదలు పెడతారు. దీంతో విద్యాశాఖ పరిపాలనా స్వరూపం సమూలంగా మారిపోనుందని భావిస్తున్నారు. ఇంత వరకూ జిల్లాల్లో డిఇఒ, ఎస్‌ఎస్‌ఎ ప్రాజెక్టు అధికారులు వేర్వేరుగా ఉన్నారు. కొత్త జిల్లాల్లో ప్రాజెక్టు అధికారుల పోస్టులను రద్దు చేసి, పిఒల బాధ్యతలను సైతం డిఇఒలకే అప్పగించనున్నారు. అలాగే కొత్త జిల్లాల్లో పరీక్షల బోర్డు తరఫున అసిస్టెంట్ కమిషనర్ల కార్యాలయాలు కూడా ఏర్పాటవుతున్నాయి. వీరంతా డిఇఒలకే రిపోర్టు చేయాల్సి ఉంటుందని ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ ఆర్ సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
కొత్త జిల్లాల డిఇఒలు
ఆదిలాబాద్ డిఇఒగా సోమిరెడ్డి, నిర్మల్‌కు ప్రణీత, మంచిర్యాలకు సహదేవ్, ఆసిఫాబాద్‌కు రసీఖ్, కరీంనగర్‌కు విజయలక్ష్మి, జగిత్యాలకు వెంకటేశ్వర్లు, సిరిసిల్లకు రాధాకృష్ణ, పెద్దపల్లికి వెంకటేశ్వరరావు, వరంగల్ అర్బన్‌కు సత్యనారాయణరెడ్డి, వరంగల్ రూరల్‌కు వాసంతి, మహబూబాబాద్‌కు వేణుగోపాల్, జనగాంకు రేణుక, భూపాలపల్లికి యాదయ్య, ఖమ్మంకు రాజేష్, భద్రాద్రి (కొత్తగూడెం)కి వెంకటనర్సమ్మ, నల్గొండకు చంద్రమోహన్‌ను నియమించారు. సూర్యాపేటకు చారి, యాదాద్రికి దీపిక, నిజామాబాద్‌కు రాజీవ్, కామారెడ్డికి మదన్‌మోహన్, మహబూబ్‌నగర్‌కు రమేష్, నాగర్‌కర్నూలుకు జనార్ధన్‌గౌడ్, వనపర్తికి సుశీందర్, గద్వాలకు నారాయణరెడ్డి, మెదక్‌కు రవికాంత్, సిద్ధిపేటకు కృష్ణారెడ్డి, సంగారెడ్డికి చంద్రకళ, హైదరాబాద్‌కు లింగయ్య, శంషాబాద్‌కు శ్రీనివాసాచారి, మల్కాజ్‌గిరికి ఉషారాణి, వికారాబాద్‌కు రోహిణి నియమితులయ్యారు.
జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారులు
కరీంనగర్, జగిత్యాలకు ఎల్ సుహాసిని, మంచిర్యాల, పెద్దపల్లికి ప్రభాకర్ దాస్, సిరిసిల్లకు కె రామచందర్, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్‌కు బి నాగేందర్‌లను జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారులుగా నియమించారు. నిజామాబాద్, కామారెడ్డికి ఒద్దెన్న, వరంగల్ అర్బన్, రూరల్‌కు కెవి ఆనంద్, మహబూబాబాద్, భూపాల పల్లికి ఎస్‌కె అహ్మద్, జనగామకు వై శ్రీనివాస్, ఖమ్మం, కొత్తగూడెంకు ఆండ్రూస్, సూర్యాపేటకు ప్రకాష్ బాబు, నల్గొండ, యాదగిరికి హన్మంతరావు, హైదరాబాద్‌కు పి కదినాద్, శంషాబాద్‌కు మొహమ్మద్ ఆలి, మహబూబ్‌నగర్, వికారాబాద్‌కు విజయలక్ష్మి, మల్కాజ్‌గిరికి ప్రభాకర్‌రావు, వనపర్తి, నాగర్‌కర్నూలుకు సుధాకర్, సంగారెడ్డికి కిషన్, సిద్దిపేట, మెదక్ జిల్లాలకు నాగమునికుమార్‌లు నియమితులయ్యారు.