బిజినెస్

వైజాగ్ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్‌గా పివి సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక/ఖైరతాబాద్ (హైదరాబాద్), అక్టోబర్ 8: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు వ్యవహరించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో శనివారం తాజ్‌కృష్ణలో జరిగిన కార్యక్రమంలో బాడ్మింటన్ స్టార్ సింధుతో వైజాగ్ స్టీల్ కార్పొరేట్ సంస్థ అయన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఇకపై బాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే జాతీయ, అంతర్జాతీయ స్థాయ టోర్నమెంట్లలో విశాఖ ఉక్కు లోగోను ముద్రించిన జెర్సీ (దుస్తులు)ని సింధు ధరిస్తారని బేస్‌లైన్ వెంచర్స్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ ఆర్ రామకృష్ణన్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ టాప్ 10 క్రీడాకారిణుల్లో ఒకరిగా ఉన్న పివి సింధు.. భారత్ తరఫున రియో ఒలింపిక్స్ 2016లో రజత (సిల్వర్) పతకాన్ని సాధించినది తెలిసిందే. ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ విభాగంలో రజతాన్ని గెలిచిన తొలి భారత క్రీడాకారిణి కూడా పివి సింధునే. ఈ విజయం అనంతరం కార్పొరేట్ సంస్థలు తమ బ్రాండ్ అంబాసిడర్‌గా సింధును నియమించుకునేందుకు పోటీపడు తున్నదీ తెలిసిందే. వీటిలో వైజాగ్ స్టీల్ వంటి ప్రముఖ సంస్థలు కూడా ఉండటం గమనార్హం. ఇకపోతే ఈ సందర్భంగా పివి సింధు మాట్లాడుతూ ఒలింపిక్స్ విజయం తర్వాత పెద్దపెద్ద సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయ డానికి ఒప్పందాలు కుదిరాయన్నారు. ఆర్‌ఐఎన్ ఎల్ ఒప్పందం కూడా పెద్దదేనన్నారు. వైజాగ్ స్టీల్‌తో కలిసి పనిచేయడం గర్వకారణమని అభిప్రాయ పడ్డారు. తన ప్రతిభ వెనక ప్రముఖ సంస్థల సహకారం మరవలేనిదన్నారు. కాగా, ప్రతి నెలా కనీసం మూడు అంతర్జాతీయ ఈవెంట్లుండేలా బాడ్మింటన్ కేలండర్ రూపుదిద్దుకుందని, అయతే సరైన ఈవెంట్లను ఎంచుకుని ముందుకెళ్లడం ముఖ్యమన్నారు. మరింత మెరుగైన ఆట తీరుతో భవిష్యత్ ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకోవడానికి, అలసట నుంచి దూరం కావడానికీ ఇది ప్రధాన మన్నారు. విశాఖ ఉక్కు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి మధుసూదన్ మాట్లాడుతూ దేశానికి విశాఖ ఉక్కు, బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు వెల కట్టలేని సంపద అని కొనియాడారు. తమ బ్రాండ్ అంబాసిడర్‌గా సింధు వ్యవహరిం చనుండటంతో మున్ముందు సంస్థ ఖ్యాతి మరింత పెరగగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు డైరెక్టర్ పిఆర్ చౌదరి కూడా పాల్గొన్నారు.

చిత్రం.. సింధుతో వైజాగ్ స్టీల్ ఒప్పంద దృశ్యం