బిజినెస్

నేడు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఐపిఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: దాదాపు రూ.6,057 కోట్ల విలువైన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థకు చెందిన పబ్లిక్ ఇష్యూ (ఐపిఓ) సోమవారం మార్కెట్లలోకి ప్రవేశించనుంది. దాదాపు ఆరేళ్ల కాలంలో భారతరుూ మార్కెట్లలోకి వస్తున్న అతి పెద్ద ఐపిఓ ఇదే కావడం గమనార్హం. భారతీయ మార్కెట్లలో తొలి బీమా పబ్లిక్ ఆఫర్ అయిన ఈ ఐపిఓ సోమవారం (19న) బిడ్డింగ్‌కు ప్రారంభమై 21న ముగుస్తుంది. ఒక్కో షేరు ధర రూ 300-334 మధ్య ఉంటుంది. ఐపిఓకు ముందే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, భారత్‌లో, విదేశాల్లో ఉండే యాంకర్ ఇనె్వస్టర్లకు ఒక్కో షేరు రూ 334 రూపాయల గరిష్ట ధరకు 4.89 కోట్లకు పైగా షేర్లను కేటాయించింది. వీటి విలువ మొత్తం రూ. 1635.33 కోట్లు.